Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?

Published : Mar 18, 2026, 11:03 AM IST

Today Gold Rate in Hyderabad: మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊగిసలాడుతున్నాయి. నిన్న ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులను బెంబేలెత్తించాయి. అయితే మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టాయి. పెద్దగా మార్పు లేకపోయినా స్వల్ప మార్పు కనిపిస్తోంది.

PREV
14
రిలీఫ్ ఇచ్చిన పసిడి, సిల్వర్

బంగారం, వెండి రేట్లు అనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నిమిషంలోనైనా, గంటలోనైనా మారిపోవచ్చు. ఇక్కడ డిమాండ్‍తో సంబంధం లేదు. అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులు, యుద్ధ పరిస్థితులు, డాలర్ హెచ్చుతగ్గులు...ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. అయితే పసిడి, సిల్వర్ ధరలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకూ తగ్గుతూ వచ్చి నిన్న సడెన్‍గా ఎగబాకింది. వెండి కూడా ఉంతే. కానీ ఇవాళ మాత్రం మార్కెట్లు రిలీఫ్ ఇచ్చాయి.

24
ఇప్పటికి రూ.21,000వేలు తగ్గుదల

జనవరిలో ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు దాదాపు ఇప్పటికీ రూ.21 వేలు తగ్గింది. అంటే గతంలో రూ.1,78,850 ఉంది. ఇవాళ హైదరాబాద్‍ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.330 తగ్గి రూ.1,57,750 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.1,44,600గా ఉంది. 18 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గింది.

34
అమాంతం తగ్గిపోయిన సిల్వర్

వెండి కూడా భారీగానే తగ్గింది. గతంలో రూ.4.25లక్షలున్న సిల్వర్...అమాతం తగ్గిపోయింది. నిన్న రూ. 4 వేలు పెరగ్గా, ఈరోజు రూ.5వేలు తగ్గింది. వెండి విషయంలో ఇది పెద్ద ఊరటగా భాస్తున్నారు. ప్రస్తుతం కిలో వెండి రూ.2,75లక్షల వద్ద కొనసాగుతోంది.

44
ఉగాది ఊరట

అసలే రేపు ఉగాది. బంగారం, వెండి రేటు తగ్గడం కాస్త ఊరటనే చెప్పాలి. కానీ మళ్లీ రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. బంగారం ధర తగ్గింది కాబట్టి ...కొనుగోలుదారులు క్యూ కట్టాలి. ధరల అస్థిరత వల్ల కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు కొనాలా? లేక ఇంకా ఆగాలా? అని సందేహంలో పడ్డారు. మార్కెట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి...నిపుణులను సంప్రదించి కొనుగోలు చేయడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories