Property Registration: అగ్రిమెంట్ అయినా రిజిస్ట్రేషన్ చెయ్యట్లేదా.. ఇలా చేస్తే దెబ్బకు కాళ్ల బేరానికి వస్తారు

Published : Mar 17, 2026, 05:44 PM IST

Property Registration: ఆస్తి కొనుగోలు వ్యవహారాల్లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు అమ్మే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలుదారుడు తన హక్కులను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తీసుకోవచ్చు. 

PREV
15
అగ్రిమెంట్ అయినా రిజిస్ట్రేషన్ చేయడం లేదా

ఆస్తి క్రయవిక్రయాల్లో ఒప్పందం(Agreement) కుదిరిన తర్వాత, అమ్మే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడితే ఏం చేయాలి? చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆందోళనకు గురవుతారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది కేవలం కాగితం కాదని, అది ఒక బలమైన న్యాయపరమైన డాక్యుమెంట్ అని తెలుసుకోవాలి.

25
మీకున్న న్యాయపరమైన హక్కులు ఇవే

రిజిస్ట్రేషన్ కోసం నిరాకరిస్తే, మీ తరపున ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసు పంపాలి. ఒప్పందంలో పేర్కొన్న గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, ఒకవేళ అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. నోటీసు ఇచ్చినా మార్పు లేకపోతే, సివిల్ కోర్టులో 'సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్' దాఖలు చేయాలి. ఒప్పందంలోని షరతుల ప్రకారం అవతలి పార్టీ రిజిస్ట్రేషన్ చేసేలా ఆదేశించాలని కోర్టును కోరవచ్చు.

35
ఇంజక్షన్ ఆర్డర్

కేసు కోర్టులో ఉన్నప్పుడు, సదరు ఆస్తిని అమ్మకందారుడు వేరే ఎవరికీ విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా ఉండటానికి కోర్టు నుంచి స్టే(Injunction) పొందవచ్చు. దీనివల్ల మీ హక్కులకు భంగం కలగదు. ఒకవేళ అడ్వాన్స్ లేదా పూర్తి మొత్తం డబ్బు తీసుకుని, కావాలనే మోసం చేస్తూ రిజిస్ట్రేషన్ చేయకపోతే, 420 సెక్షన్ కింద పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.

45
వారసుల బాధ్యత

అగ్రిమెంట్ చేసిన వ్యక్తి ఒకవేళ మరణించినా, అతని చట్టపరమైన వారసులు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. వారు కూడా రిజిస్ట్రేషన్ చేయకపోతే వారిపై కూడా కేసు దాఖలు చేయవచ్చు.

55
అగ్రిమెంట్ ఆఫ్ సేల్

ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్‌ను పక్కాగా రాసుకోవడం, సాక్షుల సంతకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒప్పందంలోని నిబంధనలను మీరు సరిగ్గా పాటించినంత కాలం, చట్టం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories