High Court: ఒక్కడే కూర్చుని అడల్ట్ సైట్‌లు చూస్తున్నారా.! హైకోర్టు ఏం చెప్పిందంటే.?

Published : Mar 17, 2026, 06:08 PM IST

High Court: భారతదేశంలో అశ్లీల చిత్రాలను వీక్షించడంపై ఉన్న చట్టపరమైన నిబంధనలను ఓ సారి చూసేద్దాం. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రదేశంలో అశ్లీల చిత్రాలను చూడటం నేరం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. 

PREV
15
పర్సనల్‌గా అడల్ట్ సైట్స్ చూస్తున్నారా.?

మారుతున్న కాలంలో ఇంటర్నెట్ వాడకం పెరగడంతో అశ్లీల చిత్రాలను చూడటంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి తన మొబైల్‌లో లేదా పర్సనల్ కంప్యూటర్‌లో అశ్లీల చిత్రాలను చూస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా? దీనిపై మన దేశంలోని చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

25
కేరళ హైకోర్టు తీర్పు:

ఒక యువకుడిపై కేరళ పోలీసులు పెట్టిన కేసును కొట్టివేస్తూ గతంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి తన ఏకాంతంలో, ఇతరులకు ఇబ్బంది కలగకుండా అశ్లీల చిత్రాలను చూడటం నేరం కాదని కోర్టు పేర్కొంది. ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత(Right to Privacy) పరిధిలోకి వస్తుందని అభిప్రాయపడింది.

35
చట్టపరమైన పరిమితులు (IPC Section 292):

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 అశ్లీలతకు సంబంధించిన శిక్షలను వివరిస్తుంది. దీని ప్రకారం.. అశ్లీల కంటెంట్‌ను బహిరంగంగా ప్రదర్శించడం నేరం. అశ్లీల చిత్రాలను విక్రయించడం, అద్దెకు ఇవ్వడం లేదా పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం. కానీ, వ్యక్తిగత వినియోగం కోసం చూసేవారిపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని కోర్టులు స్పష్టం చేస్తున్నాయి.

45
చైల్డ్ అడల్ట్ - అత్యంత ప్రమాదకరం:

అడల్ట్ సైట్‌లకు ఉన్న మినహాయింపులు చైల్డ్ అడల్ట్‌కి వర్తించవు. పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను చూడటం, వాటిని డౌన్లోడ్ చేసి ఫోన్లో ఉంచుకోవడం లేదా ఇతరులకు షేర్ చేయడం అత్యంత తీవ్రమైన నేరం. పోక్సో(POCSO) చట్టం, ఐటీ చట్టం కింద ఇలాంటి పనులకు పాల్పడే వారికి కఠినమైన జైలు శిక్షలు విధిస్తారు.

55
వ్యక్తిగత జీవితం పర్యవేక్షించడం..

ప్రభుత్వం ప్రతి పౌరుడి వ్యక్తిగత జీవితాన్ని పర్యవేక్షించలేదని, అయితే చట్టం నిర్దేశించిన హద్దులను దాటకూడదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం చట్టరీత్యా తప్పు. చట్టంపై అవగాహన కలిగి ఉండటం వల్ల అనవసరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories