పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో నేడు 24క్యారెట్ల పసిడి ధర ఎంతంటే ?

First Published Sep 28, 2021, 1:09 PM IST

ఈ రోజు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్స్ ఫ్యూచర్స్ క్షీణించాయి. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎం‌సి‌ఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.15 శాతం (రూ. 67) తగ్గి రూ. 46,002కి చేరుకుంది. వెండి 0.26 శాతం (రూ .158) క్షీణించి కిలోకు రూ .60,476 కి చేరింది. 

గత సంవత్సరం గరిష్ట స్థాయి నుండి పసిడి ధర 10 గ్రాములకు రూ. 56,200 నుండి ఇప్పటికీ రూ. 10198 తగ్గింది. ఆగస్టులో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. దేశీయ డీలర్లు రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. 
 

వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా

డెల్టా వేరియంట్ కేసుల వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల మధ్య వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వహిస్తున్నారు . ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహం బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ. 46,170కి విక్రయమవుతుంది, సోమవారం వెండి స్పాట్ మార్కెట్‌లో కిలోకు రూ .60,341 కి విక్రయించారు. 

ప్రపంచ మార్కెట్లో

డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పెరిగింది. ఈరోజు ప్రపంచ మార్కెట్లలో స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి 1,748.01 డాలర్లకు చేరుకుంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి ఔన్సు  1,747.50 డాలర్ల వద్ద ఉంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.8 శాతం తగ్గి ఔన్సు 22.47 డాలర్ల వద్ద ఉంది. పల్లాడియం 0.6 శాతం తగ్గి 1,952.44 డాలర్లు, ప్లాటినం 0.5 శాతం తగ్గి 976.07 డాలర్ల వద్ద ఉన్నాయి. 

పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ సోమవారం పోలాండ్ సెంట్రల్ బ్యాంక్‌లో 230 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉందని, దాని నిల్వలను విస్తరించుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290 ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి పెరగగా బంగారం ధర రూ.47,290కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.43,350కు చేరింది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

click me!