ఇంధన ధరలకు మళ్ళీ రెక్కలు.. వరుసగా 3వ రోజు కూడా పెంపు..

First Published Sep 28, 2021, 12:12 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు నేడు మళ్లీ సవరించాయి. దీంతో ఈ రోజు డీజిల్ ధర 25 నుండి 27 పైసలు పెరిగగా, పెట్రోల్ ధర 20 నుండి 25 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ రెండింటి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.   
 

ఈ రోజు అంటే సెప్టెంబర్ 28న  చమురు మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేసిన ధరల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ప్రకారం దేశంలోని నాలుగు మెట్రో నగరాలను పోల్చి చూస్తే ముంబైలో పెట్రోల్, డీజిల్ అత్యంత ఖరీదైనవిగా మారాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను, రవాణా వ్యయం కారణంగా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలో వ్యత్యాసం ఉంటుంది.

డీజిల్ ధర దేశవ్యాప్తంగా గత 5 రోజుల్లో 4 సార్లు పెరిగింది దీంతో లీటరుకు 95 పైసలు పెరిగింది. భారతీయ చమురు కంపెనీలు ఇటీవల సెప్టెంబర్ 24న డీజిల్ పై లీటరుకు 20 పైసలు, సెప్టెంబర్ 26 ఇంకా 27 తేదీలలో 25 పైసలు పెరిగాయి. నేడు వరుసగా మూడవ రోజు అంటే సెప్టెంబర్ 28న లీటరుకు 25 పైసలు పెరిగాయి. ఈ విధంగా ఇప్పటి వరకు సెప్టెంబర్ నెలలో డీజిల్ ధర లీటరుకు  రూ.1 పెరిగింది. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ నెలలో పెట్రోల్ ధరలను పెంచడం ఇదే మొదటిసారి. దీనికి ముందు, పెట్రోల్ ధర చాలా కాలం పాటు స్థిరంగా ఉంది.   

Latest Videos


petrol pump for tribal women

ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధర  తెలుసుకోండి..

నగరం    డీజిల్    పెట్రోల్
ఢిల్లీ         89.57    101.39
ముంబై    97.21    107.47 
కోల్‌కతా    92.67    101.87  
చెన్నై        94.17    99.15
(పెట్రోల్-డీజిల్ ధర లీటరుకు రూపాయిల్లో ఉంది.) 

ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది,
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఒడిషాలో పెట్రోల్ ధర  రూ.100 దాటింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. 
 
మీ నగరంలో
పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోవడానికి మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మీరు ఆర్‌ఎస్‌పి, మీ నగర కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

ఇక్కడ తనిఖీ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షితారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.

click me!