అక్టోబరులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి..

First Published Sep 27, 2021, 2:21 PM IST

మీరు బ్యాంకులకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పని  చేయాలనుకుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సురక్షితమైన భౌతిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం. 

అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకింగ్ పనులను పరిష్కరించుకోవాలని సూచించింది. ఒకవేళ బ్రాంచ్‌ని సందర్శించడం అవసరమైతే అక్టోబర్‌లో ఏ రోజున బ్యాంకులు మూసివేయనున్నాయో కస్టమర్‌లు తప్పక తెలుసుకోవాలి.
 

ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ నెలలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు 14 సెలవులు నిర్ణయించారు. ఈ సెలవులు 1, 2, 6, 7, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 22 ఇంకా 26 తేదీలలో ఉన్నాయి.

   తేదీ                        రాష్ట్రం                                  సెలవు
1 అక్టోబర్ 2021    గ్యాంగ్‌టాక్                                  బ్యాంక్ వార్షిక మూసివేత
2 అక్టోబర్ 2021    అన్ని రాష్ట్రాలు                           మహాత్మా గాంధీ జయంతి
6 అక్టోబర్ 2021    అగర్తలా, కోల్‌కతా ,బెంగళూరు     మహాలయ అమావాస్య
7 అక్టోబర్ 2021    ఇంఫాల్                             మేరా చోరోన్ హోయ్బా లైనింగ్‌థౌ సన్మహి
12 అక్టోబర్ 2021    అగర్తలా, కోల్‌కతా              దుర్గా పూజ (మహా సప్తమి)
13 అక్టోబర్ 2021    అగర్తలా, ఇంఫాల్, కోల్‌కతా, గాంగ్‌టక్, గౌహతి, చెన్నై, తిరువనంతపురం, పాట్నా, బెంగళూరు, రాంచీ, లక్నో, షిల్లాంగ్    దుర్గా పూజ (మహా అష్టమి)
14 అక్టోబర్ 2021    అగర్తలా, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, గ్యాంగ్‌టక్, గౌహతి, చెన్నై, తిరువనంతపురం, పాట్నా, బెంగళూరు, రాంచీ, లక్నో, షిల్లాంగ్    దుర్గా పూజ / దసరా (మహా నవమి) / ఆయుధ పూజ

15 అక్టోబర్ 2021    ఇంఫాల్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలు    దుర్గా పూజ / దసరా / దసరా (విజయ దశమి)
16 అక్టోబర్ 2021    గ్యాంగ్‌టాక్                                 దుర్గా పూజ (దాసైన్)
18 అక్టోబర్ 2021    గౌహతి                                       కతి బిహు
19 అక్టోబర్ 2021    అహ్మదాబాద్, ఇంఫాల్, కాన్పూర్, కొచ్చి, చెన్నై, జమ్మూ, తిరువనంతపురం, డెహ్రాడూన్, న్యూఢిల్లీ, నాగపూర్, బేలాపూర్, భోపాల్, ముంబై, రాంచీ, రాయపూర్, లక్నో, శ్రీనగర్, హైదరాబాద్    ఈద్-ఇ-మిలాద్/ఈద్-ఇ-మిలాదున్నబి/మిలాద్-ఇ-షరీఫ్ /బరావఫత్
20 అక్టోబర్ 2021    అగర్తలా, కోల్‌కతా, చండీగఢ్, బెంగళూరు, సిమ్లా   మహర్షి వాల్మీకి పుట్టినరోజు/లక్ష్మీ పూజ/ఈద్-ఇ-మిలాద్
22 అక్టోబర్ 2021    జమ్మూ అండ్ శ్రీనగర్    ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తరువాత శుక్రవారం
26 అక్టోబర్ 2021    జమ్మూ అండ్ శ్రీనగర్    అభిగమన్ రోజు

వీటితో పాటు శని, ఆదివారాలను కూడా జోడిస్తే మొత్తం సెలవులు 21రోజులు అవుతాయి. అక్టోబర్ 3, అక్టోబర్ 10, అక్టోబర్ 17, అక్టోబర్ 24, అక్టోబర్ 31 ఆదివారాలు కాబట్టి ఈ రోజుల్లో అన్ని రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. అంతేకాకుండా అక్టోబర్ 9 నెలలో రెండవ శనివారం, అక్టోబర్ 23 నాల్గవ శనివారం కూడా అన్ని రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. 

గమనిక : ఈ సెలవులన్నింటిలో వివిధ రాష్ట్రాల సెలవులు కూడా ఉన్నాయని గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ఇతర సమాచారాన్ని తేకుసుకోవచ్చు.

click me!