ఏ‌టి‌ఎంలో క్యాష్ లేదా? అయితే బ్యాంకు రూ. 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది..

First Published Aug 13, 2021, 7:54 PM IST

ఏ‌టి‌ఎం నుండి డబ్బు ఉపసంహరించుకునే సమయంలో  ఒకోసారి క్యాష్ లేకవాపోవడంతో చాలా మంది సమస్యలను ఎదురుకొంటుంటారు. దీంతో డబ్బు కోసం ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంటుంది. దీనిని పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ తాజాగా చర్యలు చేపట్టింది.
 

ఏటీఎంలలో నగదు అయిపోతే బ్యాంకులకు జరిమానా విధించే ప్రణాళికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) రూపొందించింది. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడం కోసం. ఆర్‌బిఐ సర్క్యులర్ ప్రకారం ఎటిఎంలలో నగదు అందుబాటులో ఉండేల చూసేందుకు ఈ పథకం ప్రారంభించారు. ఈ నియమం అక్టోబర్‌ నుండి అమల్లోకి రానుంది.
 

ఏటీఎంలలో నగదు లభ్యం కాకపోవడంపై అనేక ఫిర్యాదుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) ఇటీవల పరిస్థితిని అంచనా వేసింది. దీని ఆధారంగా ఈ రూల్ రూపొందించారు. ఒక నెలలో పది గంటలకు పైగా ఏ‌టి‌ఎంలో నగదు కొరత ఉంటే ఆ బ్యాంకుకు జరిమానా విధించాలని ఆర్‌బి‌ఐ ఆదేశించింది. అంటే ఇప్పుడు ఏటీఎంలలో  క్యాష్ అందుబాటులో లేకపోతే రూ.10,000 జరిమానా విధించబడుతుంది. 

 బ్యాంకులు లేదా వైట్ లేబుల్ ఏ‌టి‌ఎం ఆపరేటర్స్  ఏ‌టి‌ఎంలలో  నగదు లభ్యతపై మానిటర్ చేయాలని ఒకవేళ నగదు అందుబాటులో లేకపోతే బ్యాంకుకు జరిమానా విధించబడుతుందని సర్క్యులర్ ద్వారా వెల్లడించింది.

ఆర్‌బిఐ కింద ఇష్యూ డిపార్ట్‌మెంట్ ఈ  జరిమానా విధిస్తుంది. ఇష్యూ డిపార్ట్‌మెంట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో ఉంటుంది. ఏటీఎంలో నగదు లేదని సమాచారం అందిన తర్వాత ఇష్యూ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ అధికారి బ్యాంకుపై జరిమానా విధిస్తారు.

undefined
click me!