Gold Price Hike: పసిడి మళ్లీ అందని ద్రాక్షే! బంగారం.. వెండి రెండూ పెరిగాయి!

Published : Jul 20, 2026, 10:25 AM IST

Gold Price Hike: బంగారం కొనాలని అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. బంగారంతో పాటు వెండి కూడా అదే దారిలో నడుస్తోంది.

PREV
14
ఆందోళన కలిగిస్తున్న గోల్డ్, సిల్వర్

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, డాలర్ బలపడటం, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా మూడో రోజూ బంగారం ధరలు పెరిగాయి.

24
రూ.1,43,290కు చేరిన పసిడి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం 10 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460కు చేరుకుంది. నిన్నటిధరతో పోలిస్తే రూ.1,43,290తో పోలిస్తే రూ.170 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,31,500గా ట్రేడవుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 పెరుగుదల నమోదైంది.

34
ఊరట ఇవ్వని వెండి

వెండి ధర కూడా కొనుగోలుదారులకు ఊరట ఇవ్వలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారంతో పాటు వెండి కొనాలనుకునే వారు కూడా అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

44
ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి

అమెరికా ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పెట్టుబడుల ధోరణి, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అందుకే రోజువారీగా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే ఒకే రోజులో కూడా నగరాన్ని బట్టి బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. స్థానిక డిమాండ్, సరఫరా, మేకింగ్ ఛార్జీలు, రాష్ట్ర పన్నులు వంటి కారణాల వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories