Gold Loan: మన దగ్గర ఉన్న బంగారం అవసరమైన సమయాల్లో పెద్ద సాయం చేస్తుంది. 10 గ్రాముల బంగారంపై ఎంత లోన్ వస్తుందో మరి ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయి.
మన దగ్గర బంగారం ఉంటే అది కష్ట సమయాల్లో మనకు అవసరపడుతుంది. ఆ బంగారాన్ని అమ్మకుండా కూడా మనం డబ్బుగా మార్చుకోవచ్చు. అదే గోల్డ్ లోన్. మరి 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం వస్తుంది.? ఇది బ్యాంక్ నియమాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత బంగారం ధర, స్వచ్ఛత కీలకం. కొన్ని గంటల్లోనే డబ్బు చేతిలో ఉంటుంది.
25
బరువు, స్వచ్ఛతే లోన్‌కు అవసరం..
మొదట బ్యాంక్ బంగారాన్ని తనిఖీ చేస్తుంది. ఎన్ని క్యారెట్లు ఉందో చెక్ చేస్తారు. రాళ్లు, ఇతర మజూరి లాంటివి తీసేస్తారు. కేవలం స్వచ్ఛమైన బంగారం బరువే పరిగణలోకి వస్తుంది. 22 క్యారెట్ అయితే విలువ ఎక్కువ. విలువ ఎంతైతే లోన్ అంత. డిజైన్‌కు విలువ ఉండదు. బరువు, స్వచ్ఛతే ఫైనల్.
35
10 గ్రాముల బంగారం = ఎంత లోన్?
ఇప్పుడు మన దగ్గర 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ఉందనుకుందాం. మార్కెట్ విలువ సుమారు రూ. 1.4 లక్షలు. బ్యాంక్‌లు సాధారణంగా 75–85 శాతం వరకు లోన్ ఇస్తాయి. అంటే రూ. 90,000 నుంచి రూ. 1.2 లక్షల వరకు వస్తుంది. ఈ లెక్క బ్యాంక్‌లపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ బంగారం ధరలు కూడా ఈ లోన్‌ను ప్రభావితం చేస్తాయి.
గోల్డ్ లోన్ వడ్డీ సాధారణంగా తక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ కంటే చాలా తక్కువ. బ్యాంకుల్లో 8.5 శాతం నుంచి 12 శాతం వరకు ఉంటుంది. NBFCలలో కొంచెం ఎక్కువ కావచ్చు. తిరిగి చెల్లించడానికి ఆప్షన్లు ఉంటాయి. EMIగా చెల్లించవచ్చు. లేదా వడ్డీ మాత్రమే చెల్లించవచ్చు. మెచ్యూరిటీలో మొత్తం కట్టే ఆప్షన్ కూడా ఉంది.
55
సమయానికి చెల్లిస్తే బంగారం సేఫ్
ఉదాహరణకు రూ. 1 లక్ష లోన్ తీసుకుంటే.. 10 శాతం వడ్డీ ఉంటే EMI సుమారు రూ. 9 వేలు. వడ్డీ మాత్రమే చెల్లిస్తే నెలకు రూ. 850.. అలా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. సమయానికి డబ్బు చెల్లించకపోతే బ్యాంక్ బంగారాన్ని వేలం వేయవచ్చు. కాబట్టి ముందే ప్లాన్ చేసుకోవాలి.