Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం

Published : Feb 05, 2026, 11:35 AM IST

Business Ideas: స‌రైన ప్లానింగ్‌తో వ్యాపారం చేస్తే త‌క్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ ఆదాయంఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా ఐస్‌క్రీమ్ వ్యాపారం. ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
వేసవిలో డిమాండ్ ఉన్న వ్యాపారం

వచ్చే సమ్మర్ సీజన్‌ను సరిగ్గా ప్లాన్ చేస్తే చిన్న పెట్టుబడితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎండలు పెరిగే కొద్దీ చల్లటి ఆహారాలపై డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో ఐస్‌క్రీమ్ వ్యాపారం ప్రారంభిస్తే తక్కువ సమయంలోనే పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాపారం బాగా నడుస్తుంది.

25
కోన్ ఐస్‌క్రీమ్ వ్యాపారానికి ఉన్న అవకాశాలు

డీమార్ట్, మాల్స్ బయట నిలబడి కోన్ ఐస్‌క్రీమ్ అమ్ముతున్న స్టాల్స్ మనం తరచూ చూస్తుంటాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కోన్ ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం. ఇదే మోడల్‌ను జిల్లా కేంద్రాలు, పట్టణాలు, బస్టాండ్ పరిసరాలు, కాలేజీలు, పార్కుల దగ్గర అమలు చేస్తే మంచి స్పందన లభిస్తుంది. ఎక్కువ స్థలం అవసరం లేకపోవడం ఈ వ్యాపారానికి పెద్ద ప్లస్ పాయింట్.

35
ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది?

ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు భారీ పెట్టుబడి అవసరం లేదు. ఒక చిన్న ఫ్రీజర్, ఐస్‌క్రీమ్ కోన్ స్టాండ్, ప్రాథమిక సామగ్రి ఉంటే సరిపోతుంది. అంచనా ఖర్చు ఇలా ఉంటుంది. ప్ర‌స్తుతం మార్కెట్‌లో కోన్ ఐస్‌క్రీమ్ మేకింగ్ మిషిన్ ధ‌ర రూ. ల‌క్ష వ‌ర‌కు ఉంది. ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రారంభంలో మెటీరియ‌ల్ కోసం రూ. 5000 నుంచి రూ. 10000 వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇక స్టాల్ సెట‌ప్‌కు రూ. 5000 వ‌ర‌కు అవుతుంది. మొత్తంగా చూస్తే సుమారు రూ. ల‌క్ష‌న్న వ‌ర‌కు అవుతుంది.

45
లాభాలు ఎలా ఉంటాయంటే.?

ఒక్కో కోన్ ఐస్‌క్రీమ్‌ను రూ. 20కి విక్రయించవచ్చు. రోజుకు కనీసం 100 ఐస్‌క్రీమ్‌లు అమ్మినా రోజువారీ ఆదాయం రూ. 2,000 అవుతుంది. ఖర్చులు పోగా రోజుకు రూ. 800 నుంచి రూ. 1,000 వరకు లాభం మిగలే అవకాశం ఉంటుంది. సమ్మర్ పీక్ సీజన్‌లో అమ్మకాలు 200 దాటితే లాభాలు మరింత పెరుగుతాయి. ఇక కేవ‌లం స‌మ్మ‌ర్‌లోనే కాకుండా ఇత‌ర సీజ‌న్‌లో కూడా ఈ వ్యాపారం న‌డుస్తుంది.

55
ఈ వ్యాపారం ఎవ‌రికి సరిపోతుంది?

ఈ ఐస్‌క్రీమ్ వ్యాపారం స్టూడెంట్స్, గృహిణులు, పార్ట్‌టైమ్ ఆదాయం కోరుకునే వారు, చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు బాగా సరిపోతుంది. సరైన లొకేషన్ ఎంపిక చేసుకుని, శుభ్రతపై దృష్టి పెడితే తక్కువ కాలంలోనే స్థిరమైన ఆదాయం పొందొచ్చు. వేసవిలో ప్రారంభించిన ఈ వ్యాపారం సరైన ప్లానింగ్‌తో ఏడాది పొడవునా కొనసాగించవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. వ్యాపారం మొద‌లు పెట్టే ముందు అంత‌కుముందు ఈ రంగంలో అనుభ‌వం ఉన్న వారిని నేరుగా సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories