Gold Loan: బంగారం విలువ భారీగా పెరుగుతోంది. దీంతో గోల్డ్‌పై రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్ తీసుకునే విషయంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం విలువ పెరగడంతో బ్యాంకులకు కొత్త ఇబ్బందులు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో బ్యాంకుల బంగారం రుణ విభాగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బంగారం విలువ పెరిగేకొద్దీ రుణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కానీ, ఈ రుణాలు తీసుకున్న వారిలో చాలామంది తిరిగి చెల్లించకపోవడంతో 30 శాతానికి పైగా ఖాతాలు ఎన్‌పీఏ (Non-Performing Assets) జాబితాలో చేరాయి.
25
నెలనెలా వడ్డీ చెల్లింపు తప్పనిసరి
ఇలాంటి పరిస్థితుల్లో రికవరీ సమస్యలను అధిగమించడానికి బ్యాంకులు కొత్త చర్యలు చేపడుతున్నాయి. గతంలో రుణ గడువు పూర్తయ్యాక వడ్డీతో కూడిన మొత్తం వసూలు చేసేవారు. అయితే, ఇప్పుడు రుణం తీసుకున్న తేదీ నుంచే నెలనెలా వడ్డీ చెల్లించాల్సిందేనని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నిబంధనను పాటించకపోతే ఖాతాదారుల సిబిల్ స్కోర్ (CIBIL Score) తగ్గిపోతుందని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. సిబిల్ స్కోర్ పడిపోతే భవిష్యత్తులో కొత్త రుణాలు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు.
35
ఎన్‌పీఏ జాబితాలో చేరితే క్రెడిట్ విలువపై ప్రభావం
రుణ గడువులోపు చెల్లింపులు జరపని వారు ఎన్‌పీఏ కేటగిరీలోకి వెళ్తున్నారు. ఒకసారి ఎన్‌పీఏ జాబితాలో చేరితే వారి క్రెడిట్ రికార్డ్ దెబ్బతింటుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాల మంజూరులో బ్యాంకులు వెనుకంజ వేస్తాయి.
సరైన విధంగా వాడితే, బంగారం రుణం మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచగలదు.
* ప్రతి నెల సమయానికి చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ చరిత్ర బలపడుతుంది. చిన్న రుణం అయినా సక్రమంగా చెల్లిస్తే మీ ప్రొఫైల్ బలంగా మారుతుంది.
* బంగారం రుణం వంటి సెక్యూర్డ్ లోన్ తో పాటు క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోన్ వంటి అన్సెక్యూర్డ్ రుణాలు ఉంటే బ్యాంకులు మిమ్మల్ని స్థిరమైన కస్టమర్‌గా భావిస్తాయి.
* కొంతమంది బంగారం రుణం తీసుకొని అధిక వడ్డీ ఉన్న ఇతర రుణాలను చెల్లిస్తారు. ఇది మొత్తం అప్పు భారాన్ని తగ్గించడమే కాకుండా సిబిల్ రిపోర్టును కూడా మెరుగుపరుస్తుంది.
55
గోల్డ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
Loan-to-Value (LTV) : RBI మార్గదర్శకాల ప్రకారం రూ.2.5 లక్షల లోపు రుణాలకు బంగారం విలువలో గరిష్టంగా 85% వరకు మాత్రమే ఇవ్వవచ్చు.
ప్యూరిటీ & విలువ: కనీసం 18 క్యారెట్ల బంగారం మాత్రమే అంగీకరిస్తారు. ప్రతి బ్యాంకు తన విధానాల ప్రకారం విలువ నిర్ణయిస్తుంది.
వడ్డీ రేటు : బంగారం రుణాలకు వడ్డీ సాధారణంగా తక్కువే, కానీ ప్రతి సంస్థలో తేడా ఉంటుంది. లోన్ తీసుకునే ముందు గమనించాలి.
డిఫాల్ట్ అయితే : చెల్లించకపోతే బంగారం వేలం వేస్తారు. సిబిల్ స్కోర్ తగ్గుతుంది.