Gas Cylinder: దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ప్రభుత్వం.. ఎవరికో తెలుసా?

Published : Oct 10, 2025, 12:49 PM IST

దీపావళి కానుకగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను (Gas Cylinder) ఇవ్వబోతోంది ప్రభుత్వం. పేద కుటుంబాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఆలోచన. ఇంతకీ ఎవరికి ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను ఇవ్వబోతున్నారో తెలుసా?

PREV
13
ఉచితంగా గ్యాస్ సిలిండర్

మనదేశంలో అతి పెద్ద పండుగలో దీపావళి ఒకటి. ఈ పండుగకు పిండివంటలతో ఘుమఘుమలాడిపోతుంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను ఇవ్వబోతోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత సిలిండర్లను ప్రకటించింది. దీనివల్ల యూపీలోని 1.75 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందనుంది. ఉత్తర ప్రదేశ్ లో దీపావళి, హోలీ పండుగలు వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ రెండు పండుగలను ఉద్దేశించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను అందించబోతున్నారు. ఈ సిలిండర్ ను ఈ నెలలోనే ఇవ్వబోతున్నారు.

23
ఏమిటి ఈ పథకం?

ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఉత్తర ప్రదేశ్ లోని అర్హత కలిగిన మహిళలకు అందించే పథకం. పండుగ సమయంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తారు. లబ్ధిదారులు మొదట ఒక ఏజెన్సీ నుండి సిలిండర్ ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఆ సిలిండర్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తుంది. ప్రభుత్వ రీయంబర్స్ మెంట్ ద్వారా ఈ సిలిండర్ ను ఉచితంగా అందిస్తారు.

33
తెలుగు రాష్ట్రాల్లో ఉందా?

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని అందిస్తోంది. ఈ పథకం గురించి తెలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని పేద మహిళలు కూడా తమకు ఇలాంటి పథకం అమలులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories