బంగారం విలువ పెరుగుతున్న కొద్దీ.. దాని చుట్టూ అపోహలు, వాదనలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంట్లో ఎంత బంగారం (Gold in House) ఉంచుకోవడం చట్టబద్ధమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ కొన్ని నియమాలను పెట్టింది.
భారత ఆర్థిక వ్యవస్థలోనే కాదు.. సంస్కృతిలోనే బంగారానికి విలువైన స్థానం ఉంది. దీని అందమైన ఆభరణంగా కాకుండా సురక్షితమైన పెట్టుబడిగా కూడా చెప్పుకుంటున్నారు. అందుకే బంగారానికి విలువ పెరిగిపోయింది. తమ దగ్గర డబ్బులు ఉంటే చాలు ఎంత బంగారం పడితే అంత బంగారం కొని ఇంట్లో పెట్టుకోవచ్చని అనుకుంటారు ఎంతోమంది. నిజానికి ఆదాయ పన్ను శాఖ నియమాల ప్రకారమే బంగారాన్ని కొనుగోలు చేయాలి.
25
అధిక బంగారం కొనకూడదా?
మీకు నచ్చినంత బంగారాన్ని కొనుక్కోవచ్చు కానీ ఆ బంగారం కొనడానికి తగ్గ ఆదాయం మీ దగ్గర ఉందని నిరూపించాలి. అప్పుడే మీరు కావలసినంత బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఎలాంటి రుజువులు లేకుండా కేవలం బంగారం మాత్రమే కొంటూ ఉంటే ఏదో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీపై రైడ్ చేయవచ్చు. మీకు వచ్చే ఆదాయం, జీతం పరంగా, వ్యవసాయపరంగా వచ్చిన ఆదాయంతో కొన్న బంగారమై ఉండాలి. అయితే దానికి తగ్గ రుజువులు మాత్రం ఉండాలి. చట్టబద్ధంగా వారసత్వంగా వచ్చిన బంగారమైనా కూడా దానికి కావలసిన ఆధారాలు ఉండాలి.
35
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు
మీరు కొనుగోలు చేసిన బంగారానికి ఎలాంటి రుజువులు లేకపోతే మాత్రం ఆదాయపు పన్ను శాఖ కొన్ని పరిమితులను పెట్టింది. పెళ్లయిన స్త్రీలు వారి దగ్గర ఎలాంటి రుజువులు లేకుండా అరకిలో బంగారాన్ని ఉంచుకోవచ్చు. అంటే 500 గ్రాముల బంగారు నగలు ఎలాంటి రుజువులు లేకపోయినా ఉంచుకోవచ్చు. అదే పెళ్లి కానీ అమ్మాయిలైతే 250 గ్రాముల బంగారు నగలను ఉంచుకోవచ్చు. పురుషుల దగ్గర 100 గ్రాముల బంగారు నగలు ఉండవచ్చు. అంతకుమించి ఉంటే మాత్రం దానికి తగ్గ బిల్లులు, ఆదాయ వనరు చూపించాలి.
బంగారాన్ని ఆభరణాల రూపంలోనే కాదు.. డిజిటల్ రూపంలో కూడా ఇప్పుడు బంగారాన్ని కొనవచ్చు. దీనికి మాత్రం ఎటువంటి చట్టపరమైన పరిమితి లేదు. మీరు ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. ప్రతిరోజూ రెండు లక్షల రూపాయల వాల్యూ చేసే బంగారాన్ని డిజిటల్ రూపంలో కొని పెట్టుకోవచ్చు. దాన్ని మూడేళ్ల కంటే ఎక్కువకాలం అలాగే ఉంచితే 20 శాతం లాభం కూడా వస్తుంది. ఇంట్లో కొని పెట్టుకునే బంగారు ఆభరణాలు దొంగల పాలయ్యే అవకాశం ఉంటుంది. కానీ డిజిటల్ గోల్డ్ ను మాత్రం ఎవరూ దొంగిలించలేరు. ఇది సురక్షితమైన పెట్టుబడి.
55
బంగారంపై జిఎస్టి
ప్రస్తుతం బంగారంపై మూడు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఇక ఆభరణాల తయారీ ఖర్చుపైన ఐదు శాతం విధిస్తున్నారు. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు బరువుపై మాత్రమే జీఎస్టీని విధిస్తున్నారు. ఇక బంధువుల నుండి మీరు బహుమతిగా బంగారాన్ని పొందితే దానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ బంగారం విలువ 50 వేల రూపాయల కన్నా తక్కువగా ఉండాలి.