Gold Price: ఓరి నాయనో..ఇవెక్కడి రేట్లురా బాబు,ఇక కొనగలమా?

Published : Feb 28, 2026, 10:32 AM IST

Gold Price: ఈ సమ్మర్ లో బంగారం ధరలు భగభగమంటున్నాయి. వెండి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ధరలు చూసి ప్రజలకు పిచ్చెక్కుతుంది. త్రుణమో, పణమో కొనే చిన్న కుటుంబాలు ఇక కొనే పరిస్థితి లేదు. (ఫిబ్రవరి 28) ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. 

PREV
16
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు

చందమామ రావే జాబిల్లి రావే అని బంగారాన్ని కూడా పిలవాలేమో. పరిస్థితి అలానే తయారైంది. ఇకపై షాపులు, ఫోటోల్లో బంగారాన్ని చూసి సర్దుకోవాలేమో. బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వెండి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ఈ ధరలు చూసి జనాలకు పిచ్చెక్కుతుంది. కొంచెం కొంచెం కొనుక్కునే మధ్యతరగతి కుటుంబాలు ఇక కొనాలనే ఆలోచన కూడా మర్చిపోతారేమో. ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు చూస్తే మతిపోవాల్సిందే. మొన్నటివరకూ తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన ధరలు…ఇప్పుడు అమాంతం వేలల్లో పెరిగిపోయింది.

26
సాధారణ వినియోగదారులకు కష్టమే

భారత్ ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో ముందున్న దేశంగా గుర్తింపు పొందింది. వివాహాలు, పండుగలు, పెట్టుబడులు…ప్రతి సందర్భంలోనూ పసిడి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్న ధరల ప్రభావంతో దేశీయంగా బంగారం కొనుగోళ్లు, దిగుమతులు కొంత మేర తగ్గినట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ అంశాన్ని World Gold Council కూడా ప్రస్తావించింది. ధరలు ఆల్ టైమ్ గరిష్ఠాలకు కాస్త దూరంలో ఉన్నప్పటికీ, సాధారణ వినియోగదారులకు మాత్రం ఇంకా ఎక్కువగానే అనిపిస్తున్నాయి.

36
తగ్గుతూ ఒక్కసారిగా పుంజుకుంటున్న రేట్లు

గత ఏడాది నుంచి బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరి చివరి వారం, ఫిబ్రవరి ప్రారంభంలో స్వల్ప తగ్గుదల కనిపించినా, ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. ఫిబ్రవరి 26–27 తేదీల్లో స్వల్పంగా తగ్గిన ధరలు ప్రస్తుతం తిరిగి పెరుగుదల దిశగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకునే మార్పులు, డాలర్ మారకపు విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ధరల మార్పులకు కారణాలుగా పేర్కొనబడుతున్నాయి.

46
24 క్యారెట్ల పసిడి (10గ్రాములు)పై రూ.3,160 పెరగడంతో తులం రూ. 1,64,730

దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,900 పెరిగి రూ. 1,51,000కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,160 పెరిగి తులం రూ. 1,64,730 వద్ద నిలిచింది. వరుస మార్పులు కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి.

56
వెండిపై కేవలం పది రోజుల్లోనే రూ. 40 వేల పెరుగుదల

ఇక వెండి ధరలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అటు కేజీ వెండి రూ.5 వేలు పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. ఫిబ్రవరి 18న రూ. 2.60 లక్షల వద్ద ఉన్న వెండి, కేవలం పది రోజుల్లోనే రూ. 40 వేల వరకు పెరిగింది. జనవరి 29న నమోదైన ఆల్ టైమ్ హై రూ. 4.25 లక్షలతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.

66
జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది

అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు 5,280 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 94 డాలర్ల స్థాయికి చేరింది. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణి, కరెన్సీ మార్పులు బంగారం–వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయాలా, వేచి చూడాలా అన్న దానిపై వినియోగదారులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories