పండగ రోజు గిఫ్ట్ గా బంగారం కొంటున్నారా.. వరుసగా 2వ రోజు పెరిగిన పసిడి, వెండి.. తులం ఏకంగా..?

First Published | Aug 31, 2023, 10:14 AM IST

ఇండియాలో  బంగారం ధరలు వరుసగా మూడు రోజులుగా పెరుగుతునే ఉన్నాయి. 31 ఆగస్టు 2023 నాటికి  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,290 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,310. దింతో బంగారం ధరలు  నేడు సుమారు 420 రూపాయలు (10 గ్రాములు) పెరిగాయి.
 

 దేశంలోని ప్రముఖ నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,150 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,000 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,000.

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు)కు రూ. 58,070 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,300. భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000.
 


ఏది ఏమైనప్పటికీ, పైన పేర్కొన్న బంగారం ధరలు కేవలం సూచిక మాత్రమే అని గమనించాలి, ఎందుకంటే వీటిలో GST, TCS ఇంకా  ఇతర లెవీలు ఉండవు. మీ స్థానిక ఆభరణాల వ్యాపారి వద్ద  ఖచ్చితమైన ధరలను ట్రాక్ చేయవచ్చు. 

హైదరాబాద్ మార్కెట్లో వరుసగా 2వ రోజు పసిడి ధరలు  పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 300 పెరిగి  రూ. 55,150 మార్క్ వద్ద ఉంది.  24 క్యారెట్ల  బంగారం ధర  10 గ్రాములకు రూ. 330 పెరిగి రూ. 60,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు  కూడా భారీగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన వెండి రేటు ఈ రోజు రూ. 700 పెరిగి కిలోకి  రూ. 80,700 వద్ద ఉంది. 

Latest Videos

click me!