
బుధవారం నాటి ట్రేడింగ్‌లో భారీ లాభాల నుంచి ప్రాఫిట్ బుకింగ్ వైపు వైపు సాగిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. అయితే, జూలై 16 (గురువారం) నాటి ట్రేడింగ్‌లో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సానుకూల ప్రారంభాన్ని చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో గిఫ్ట్ నిఫ్టీ సుమారు 24,112 మార్కు వద్ద ట్రేడవుతూ దేశీయ ఈక్విటీ మార్కెట్లకు పాజిటివ్ ఓపెనింగ్ సిగ్నల్స్ ఇచ్చింది.
అంతకుముందు సెషన్‌లో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మార్కెట్‌ను ఆదుకోగా.. మెటల్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో బలహీనత కనిపించింది. నిన్నటి ముగింపులో సెన్సెక్స్ 130.49 పాయింట్లు (0.17%) పెరిగి 77,185.43 వద్ద, నిఫ్టీ 26.45 పాయింట్లు (0.11%) లాభపడి 24,078.50 వద్ద సెటిల్ అయ్యాయి.
గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే, ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌లో గిఫ్ట్ నిఫ్టీ 62 పాయింట్లు లేదా 0.26 శాతం పెరిగి 24,104 వద్ద కదలాడింది. ఇది దలాల్ స్ట్రీట్‌కు మంచి బూస్ట్ ఇచ్చే విషయమే. కానీ మరోవైపు, ఆసియా పసిఫిక్ రీజియన్‌లోని మార్కెట్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి క్లియర్ గా కనిపిస్తోంది. సెమీకండక్టర్ స్టాక్స్‌లో కొత్తగా వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
జపాన్ టోపిక్స్ 0.8% తగ్గగా, జపాన్ నిక్కీ 225 ఏకంగా 3% పైగా, సౌత్ కొరియా కోస్పి 6% పైగా పతనమయ్యాయి. గ్లోబల్ క్యూస్ మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెప్పారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోందని, ప్రోలాంగ్డ్ డిస్రప్షన్స్ వల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లైస్, ఆర్థిక వృద్ధికి రిస్క్ పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అయిన ఐఎంఎఫ్ హెచ్చరించింది.
ఆసియా మార్కెట్లలో గందరగోళం ఉన్నప్పటికీ, నిన్న రాత్రి యూఎస్ మార్కెట్లు (Wall Street) మాత్రం లాభాల్లో ముగిశాయి. యూఎస్‌లో ద్రవ్యోల్బణం డేటా కాస్త తగ్గడం, సెకండ్ క్వార్టర్ ఫలితాలు బలంగా ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెమీకండక్టర్ షేర్లు కాస్త వీక్‌గా ఉన్నా, కన్స్యూమర్ రీటైల్, ట్రావెల్ అండ్ లీజర్ స్టాక్స్ దుమ్మురేపాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 150.91 పాయింట్లు (0.29%) పెరిగి 52,659.18 వద్ద ముగిసింది.
ఎస్‌అండ్ పీ 500 సూచీ 28.83 పాయింట్లు (0.38%) లాభంతో 7,572.42 వద్ద, నాస్డాక్ కాంపోజిట్ 162.22 పాయింట్లు (0.62%) పెరిగి 26,269.23 వద్ద క్లోజ్ అయ్యాయి. కాగా, యూఎస్ డాలర్ ఇండెక్స్ ఒక నెల కనిష్ట స్థాయి వద్దే ఫ్లాట్‌గా కొనసాగుతోంది. 10-ఇయర్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 4.55% వద్ద, 2-ఇయర్ బాండ్ ఈల్డ్స్ 4.14% వద్ద ట్రేడవుతున్నాయి.
మిడిల్ ఈస్ట్‌లో ఇరానియన్ సైనిక స్థావరాలపై యూఎస్ మరోసారి దాడులు చేయడంతో టెన్షన్స్ పీక్స్‌కు చేరాయి. హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయాలతో క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి.
చమురు ధరల పెరుగుదలు, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల బుధవారం రూపాయి విలువ యూఎస్ డాలర్‌తో పోలిస్తే 16 పైసలు క్షీణించి 96.32 వద్ద ముగిసింది. రూపాయి బలహీనపడటం భారత మార్కెట్ సెంటిమెంట్‌ను కాస్త దెబ్బతీసే అంశం. ఇక గోల్డ్ రేట్లు విషయానికి వస్తే, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, మిడిల్ ఈస్ట్ దాడుల మధ్య ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని అంచనా వేస్తూ పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
మార్కెట్ ఎనలిస్టుల ప్రకారం, నిఫ్టీ ప్రస్తుత కన్సాలిడేషన్ మోడ్‌ను కొనసాగించే అవకాశం ఉంది. నిఫ్టీ 23,800 నుండి 24,350 రేంజ్‌లో ట్రేడ్ కావచ్చని భావిస్తున్నారు. గత శుక్రవారం నాటి గ్యాప్ ఏరియా, సోమవారం నాటి లో లెవెల్ అయిన 24,000-23,950 నిఫ్టీకి తక్షణ సపోర్ట్‌గా పనిచేస్తాయి. శామ్కో సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ అనలిస్ట్ ధూపేష్ ధమేజా ప్రకారం, ఆప్షన్ చైన్ డేటా 24,000 స్ట్రైక్ వద్ద గరిష్ఠ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ను చూపిస్తోంది, ఇది బలమైన సపోర్ట్ బేస్‌ను సూచిస్తుంది.
అదే సమయంలో 24,200 అండ్ 24,500 స్ట్రైక్స్ వద్ద గరిష్ఠ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఓవర్ లోడ్ సప్లై ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. షార్ట్ టర్మ్ సపోర్ట్ 23,800-23,900 వద్ద ఉండగా, మార్కెట్ 24,350 దాటితేనే 24,600 లెవెల్స్ వైపు దూసుకెళ్లే బలం వస్తుందని టెక్నికల్ వ్యూ చెబుతోంది. మార్కెట్ భయాన్ని కొలిచే ఇండియా విక్స్ 3.5% తగ్గి 13.27 స్థాయికి చేరింది, ఇది వోలటాలిటీ తగ్గుతుందనడానికి సంకేతం.
ఫండ్ ఫ్లో యాక్షన్ విషయానికి వస్తే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జూలై 15న వరుసగా మూడో సెషన్‌లోనూ నికర విక్రయదారులుగా ఉండి, రూ. 735 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. దీనికి భిన్నంగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా ఆరో సెషన్‌లోనూ కొనుగోళ్లను కొనసాగిస్తూ రూ. 704 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ 95% దాటడం వల్ల ఈరోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ పీరియడ్‌లో కేయిన్స్ (Kaynes) స్టాక్ మాత్రమే ఉంది.
గమనిక: మార్కెట్ నిపుణులు చెప్పే ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు సర్టిఫైడ్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.