Savings Schemes: రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ.. 8.20% రిటర్న్ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే

Published : Nov 22, 2026, 06:19 PM IST

Savings Schemes: తక్కువ రిస్క్‌తో ఎక్కువ వడ్డీ పొందాలనుకునే వారికి పోస్టాఫీసు, ప్రభుత్వ పథకాల్లో 8.20% వరకు రిటర్న్ లభిస్తోంది. ఎఫ్ డీల కంటే ఎక్కువ వడ్డీని అందించే ప్రభుత్వ పథకాల వివరాలు మీకోసం.

PREV
15
మీ డబ్బుకు బెస్ట్ రిటర్న్.. 7.50% నుంచి 8.20% వడ్డీ ఇచ్చే స్కీమ్‌లివే

మీరు మీ పొదుపుపై మంచి వడ్డీ రావాలని కోరుకుంటున్నారా? అది కూడా పెట్టుబడిలో పెద్దగా రిస్క్ తీసుకోకూడదని అనుకుంటున్నారా? అయితే పోస్టాఫీసు పథకాలు, ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్‌లు మీకు మంచి ఆప్షన్‌గా ఉంటాయి.

ఈ పథకాల్లో 7.5% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ లభిస్తోంది. కొన్ని స్కీమ్‌లలో వడ్డీ రేటు ఏకంగా 8.20% వరకు ఉంది. వీటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లాంటి ఆప్షన్‌లు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం..

25
8.20% వడ్డీ ఇచ్చే సీనియర్ సిటిజన్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ముఖ్యంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కోసం ఉంది. ఇందులో ప్రస్తుతం ఏడాదికి 8.20% వడ్డీ ఇస్తున్నారు. దీని మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. దీన్ని మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఇందులో గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన లో ఏడాదికి 8.20% వడ్డీ లభిస్తోంది. 10 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఖాతా తెరవవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250, గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు జమ చేయవచ్చు. దీర్ఘకాలంలో ఆడపిల్ల చదువు, పెళ్లి కోసం ఫండ్ సిద్ధం చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్.

35
ఆర్బీఐ బాండ్, NSC స్కీమ్ వివరాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్‌పై ప్రస్తుతం 8.05% వడ్డీ వస్తోంది. దీని వడ్డీ రేటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రీసెట్ అవుతుంది. వడ్డీ చెల్లింపు కూడా ఆరు నెలలకు ఒకసారి చేస్తారు. దీని మెచ్యూరిటీ కాలం 7 ఏళ్లు. అయితే ముందుగా డబ్బు తీసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.

పోస్టాఫీసు పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో ఏడాదికి 7.70% వడ్డీ ఇస్తున్నారు. దీని పెట్టుబడి కాలం 5 ఏళ్లు. కనీసం రూ. 1,000తో పెట్టుబడి మొదలుపెట్టవచ్చు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. ఇందులో వచ్చే వడ్డీ ఏడాదికి ఒకసారి కలిపి లెక్కిస్తారు. చెల్లింపు మాత్రం మెచ్యూరిటీ సమయంలో ఇస్తారు. అర్హత ఉన్న పెట్టుబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందవచ్చు.

45
కేవీపీ, 5 ఏళ్ల టైమ్ డిపాజిట్, బ్యాంక్ ఎఫ్డీలు

కిసాన్ వికాస్ పత్రలో ప్రస్తుతం ఏడాదికి 7.50% వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో పెట్టిన డబ్బు 115 నెలల్లో అంటే 9 ఏళ్ల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. కనీసం రూ. 1,000తో ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. నిర్ణీత కాలం డబ్బు ఉంచితే మొత్తం రెట్టింపు కావడం దీని ప్రత్యేకత.

పోస్టాఫీసు 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఏడాదికి 7.50% వడ్డీ ఇస్తున్నారు. ఇది బ్యాంక్ ఎఫ్డీ లాగా పని చేస్తుంది. ఒకేసారి మొత్తం జమ చేయాలి. కాలం పూర్తయ్యాక వడ్డీతో కలిపి డబ్బు వస్తుంది. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు అవకాశం కూడా ఉంది.

కొన్ని బ్యాంకులు కూడా ఎంచుకున్న కాలానికి సంబంధించిన ఎఫ్డీలపై 7.5% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. అయితే వడ్డీ రేటు బ్యాంక్, పెట్టుబడి కాలం, కస్టమర్ కేటగిరీని బట్టి మారుతుంది. చాలా బ్యాంకులు సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్‌లకు అదనపు వడ్డీ ఇస్తాయి.

55
పెట్టుబడి పెట్టే ముందు గమనించాల్సిన విషయాలు

కేవలం ఎక్కువ వడ్డీ కనిపిస్తోందని వెంటనే పెట్టుబడి నిర్ణయం తీసుకోకూడదు. ప్రతి స్కీమ్‌కు లాక్ ఇన్ పీరియడ్, మెచ్యూరిటీ, పన్ను నియమాలు, ముందే డబ్బు తీసుకునే షరతులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే మీ అవసరం, పెట్టుబడి పెట్టగలిగే కాలాన్ని బట్టి సరైన పథకాన్ని ఎంచుకోవాలి. దీని కోసం మీరు ఆర్థిక నిపుణులు సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories