instant loan: ఎప్పుడు ఎమర్జెన్సీ ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చేందుకు అనేక డిజిటల్ లోన్ యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.50,000 వరకు తక్షణ రుణం పొందొచ్చు. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.
అనారోగ్య సమస్యలు సడన్ గా బయటపడతాయి. అలాంటప్పుడు వైద్యానికి వెంటనే డబ్బు రెడీగా ఉండకపోవచ్చు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రూ.50,000 లోన్ ఇచ్చేందుకు అనేక డిజిటల్ యాప్స్, బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఇదే కాకుండా అత్యవసరంగా ఇల్లు బాగు చేయించాలన్నా, లేదా ఊహించని ఖర్చు వచ్చినా అనేక డిజిటల్ ప్లాట్ ఫాం లు, బ్యాంకులు తక్షణ రుణాలను అందిస్తున్నాయి.
ఈ లోన్ తీసుకోవాలంటే భారీగా డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన పని లేదు. చాలా కాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం కొన్ని నిమిషాల్లో ప్రాసెస్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్, కొన్ని ముఖ్యమైన పత్రాలు మీ దగ్గర ఉంచుకుంటే నిమిషాల్లో రూ.50 వేలు రుణం పొందొచ్చు.
25
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఇన్ స్టంట్ లోన్ అంటే షార్ట్ టర్మ్ లోన్. ఇవి చాలా వరకు సెక్యూరిటీ లేని రుణాలుగా ఉంటాయి. అంటే మీరు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా బ్యాంకులు, లోన్ యాప్స్ అభ్యర్థికి మినిమం అర్హత ఉంటే ఇచ్చేస్తున్నాయి. అవి ఏంటంటే..
దరఖాస్తుదారు 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. సాధారణ నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి. కనీస క్రెడిట్ స్కోర్ 650 ఉండాలి. సాలరీ తీసుకొనే ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు, అత్యవసర అవసరాలను ఎదుర్కొంటున్న కొత్త ఆదాయం సంపాదించే వారికి ఈ ఇన్‌స్టంట్ రుణాలు ఇస్తారు.
35
నిమిషాల్లోనే అకౌంట్ లోకి డబ్బులు
ఇన్‌స్టంట్ లోన్ ప్రధాన ప్రయోజనం ఏమిటంటే చాలా త్వరగా ప్రాసెస్ పూర్తవుతుంది. చాలా వెబ్‌సైట్‌లు 15 నిమిషాల్లోపు ఈ లోన్స్ ఆమోదిస్తున్నాయి. మొత్తం కొన్ని గంటల్లో లోన్ అమౌంట్ జమ అవుతుంది.
మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి కొన్ని ముఖ్యమైన పత్రాలు మాత్రమే సమర్పిస్తే సరిపోతుంది. ఈ రుణాల టెన్యూర్ చాలా వరకు 3 నెలల నుండి 2 సంవత్సరాల మధ్య ఉంటుంది. అందువల్ల లోన్ తిరిగి చెల్లించడం సులభం అవుతుంది. అయితే సాంప్రదాయ బ్యాంక్ రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.
ఇన్ స్టంట్ లోన్ కి దరఖాస్తు చేయడానికి, నమ్మకమైన రుణ యాప్ లేదా బ్యాంక్‌ను ఎంచుకోండి. వారి అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌ను సందర్శించండి.
ముందుగా ప్రాథమిక వ్యక్తిగత, ఆర్థిక వివరాలతో ఫారమ్‌ను నింపాలి.
తర్వాత KYC డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. చాలా వెబ్‌సైట్‌లు డిజిటల్ వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తాయి. కాబట్టి మీరు ఆన్‌లైన్ KYCని పూర్తి చేసి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మీరు ఉంటే లోన్ వెంటనే ఆమోదం పొందుతుంది. ఒకసారి లోన్ అప్రూవల్ అయితే డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
55
సకాలంలో చెల్లించడం తప్పనిసరి
ఇన్ స్టంట్ లోన్ ఎంత ఈజీగా వస్తుందో, దాన్ని సకాలంలో తీర్చకపోతే అన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. లోన్ ఇచ్చిన బ్యాంకు లేదా యాప్ ఇలాంటి ష్యూరిటీ లేని రుణాలు తీసుకున్న వారిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తుంది.
ఒక్క నెల ఈఎంఐ కట్టకపోయినా ఫైన్లు భారీగా ఉంటాయి. అంతేకాకుండా లీగల్ గా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు బాధ్యతాయుతంగా రుణం తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే అది మనశ్శాంతిని ఇస్తుంది. లేకపోతే రెట్టింపు అప్పులు మిగులుతాయి.