ప్రముఖ ప్రభుత్వ టెలికాలం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే 4జీ మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏకంగా 75,000కిపైగా 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే మరో లక్ష టవర్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
దేశంలో ప్రతీ గ్రామంలో 4జీ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ పనిచేస్తోంది. అలాగే యూజర్లను పెంచుకునేందుకు సరికొత్త ప్లాన్స్‌ను పరిచయం చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.