ఆంపియర్ మాగ్నస్ నియో ఫీచర్ల లిస్ట్
ఆంపియర్ మాగ్నస్ నియో స్కూటర్ డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి అధునాతన సదుపాయాలను కలిగి ఉంది. అంతేకాకుండా నావిగేషన్ సిస్టమ్, లో బ్యాటరీ ఇండికేటర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టర్న్ సిగ్నల్ లైట్లు వంటి మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ స్కూటర్ లో ఉన్న స్మార్ట్ ఫీచర్లలో ఒకటి ఏంటంటే.. స్మార్ట్ పుష్ బటన్ స్టార్ట్. దీంతో మీకు స్కూటర్ స్టార్ట్ చేయడం చాలా సింపుల్ గా ఉంటుంది. హెల్మెట్ తీసుకెళ్లడానికి సీట్ల కింద అవసరమైనంత స్టోరేజ్ కూడా ఉంది.