అంబులెన్స్ కి దారి ఇవ్వకపోతే రూ.10,000 ఫైన్
బైక్ మీద స్టంట్స్ చేసినా, డేంజర్ గా డ్రైవ్ చేసినా, లేదా రేసింగ్ చేసినా ఇప్పటి వరకు రూ.500 ఫైన్ వసూలు చేసి వదిలేసేవారు. ఇకపై ఏకంగా రూ.5,000 ఫైన్ విధిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే విధించే రూ.500లకు బదులు ఇప్పుడు రూ.5,000 ఫైన్ కట్టాలి.
అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ వెహికల్స్ కు దారి ఇవ్వకపోతే ఇంతకుముందు రూ.1,000 జరిమానా విధించేవారు. ఇప్పుడు రూ.10,000 వరకు ఫైన్ వేస్తారు.
18 ఏళ్ల లోపు వాళ్ళు డ్రైవ్ చేస్తే రూ.2,500 నుండి రూ.25,000 ఫైన్ పెంచారు. దీంతో పాటు 3 ఏళ్ళు జైలు శిక్ష, ఏడాది పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.