Adani Enterprises: విదేశాల నుంచి బొగ్గు దిగుమతి కోసం కోల్ ఇండియా టెండర్ దక్కించుకున్న అదానీ, షేర్లలో జంప్..

First Published Jul 4, 2022, 4:34 PM IST

ప్రస్తుతం మార్కెట్లో బాగా వినిపిస్తున్న పేరు అదానీ గ్రూప్ అనే చెప్పాలి. గత నెల రోజులగా మార్కెట్ పడిపోతున్నప్పటికీ, అదానీ గ్రూపు షేర్లు మాత్రం పై పైకి వెళ్తున్నాయి. తాజాగా కంపెనీ అదానీ గ్రూపు ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ షేర్లు మార్కెట్లో బుల్లిష్ గా దూసుకెళ్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ముఖ్యంగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకొని, దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసే టెండర్ ను కోల్ ఇండియా నుంచి పొందే దిశగా అడుగులు వేస్తోంది. మరి మీరు కూడా Adani Enterprises Ltd షేర్లపై ఓ లుక్కేయండి...

గౌతమ్ అదానీకి చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ Adani Enterprises Ltd, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India) బొగ్గు దిగుమతి టెండర్‌ను పొందడం దాదాపు ఖాయమైంది. వాస్తవానికి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కోల్ ఇండియా కోసం విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడానికి అతి తక్కువ ధరకు బిడ్ చేసింది. అయితే విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరపున కోల్ ఇండియా ఈ టెండర్ జారీ చేసింది. 

అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.416 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా కోసం రూ. 4,033 కోట్ల బిడ్‌ను ఫ్రైట్-ఆన్-రోడ్, freight-on-road (FOR) ప్రాతిపదికన ఉంచినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం తెలిసింది.  అదే సమయంలో మోహిత్ మినరల్స్ రూ.4,182 కోట్లకు బిడ్ వేసింది. చెట్టినాడ్ లాజిస్టిక్స్ రూ.4,222 కోట్లకు బిడ్ వేసింది. శుక్రవారం బిడ్లను తెరవగా, అదానీ ఎంటర్ ప్రైజ్ అతి తక్కువకే బిడ్ వేసినట్లు తేలింది. 

దేశంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకొని ఏడు ప్రభుత్వ రంగ థర్మల్‌ పవర్‌ కంపెనీలకు, 19 ప్రైవేట్‌ పవర్‌ ప్లాంట్లకు అందించే యోచనలో కోల్ ఇండియా ఉంది. దీంతో సోమవారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 2% వరకు పెరిగాయి. కంపెనీ షేర్లు రూ.2,260.60 వద్ద ట్రేడవుతున్నాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ జనవరి, జూన్ మధ్య నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి అనేక బొగ్గు దిగుమతి కాంట్రాక్టులను పొందింది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని  గనుల నుంచి అదానీ గ్రూప్ భారత్‌కు తొలిసారి బొగ్గును సరఫరా చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం ప్రారంభమయ్యే 6 మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి కోసం కూడా  అదానీ గ్రూప్ టెండర్ వేలం వేయవచ్చు. మునుపటి సమావేశంలో, మొత్తం 11 మంది దిగుమతిదారులు, కొంతమంది విదేశీ వ్యాపారులు బిడ్డింగ్‌పై ఆసక్తి చూపారని CIL ఇప్పటికే పేర్కొంది. 

వర్షాకాలం తర్వాత విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది..

వర్షాకాలం పూర్తవక ముందే  బొగ్గు  దిగుమతి పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బొగ్గు సరఫరా తగ్గకముందే పవర్ ప్లాంట్‌లో తగిన నిల్వను ఉంచుకోవాలని ప్రణాళిక వేస్తోంది. వ్యవసాయానికి అధిక విద్యుత్ వినియోగం, వేడి వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో విద్యుత్ డిమాండ్ వర్షాకాలం తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, థర్మల్ పవర్ ప్లాంట్లలో 26.8 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని తేలింది. అయితే అన్ని విద్యుత్ ప్లాంట్లు తమ బొగ్గు అవసరాల్లో 10% దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

click me!