Gas Cylinder price: ఉదయాన్నే ప్రజలకు షాక్, గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు నుంచి పెంపు.. ఇంతకీ ఎంత?

Published : Oct 01, 2025, 09:32 AM IST

చాలా నెలలుగా సిలిండర్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు సిలిండర్ ధర (Gas Cylinder price) పెరిగింది.  అక్టోబర్ 1 నుంచి 16 రూపాయలు పెరుగుతుంది. అయితే కేవలం కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రమే పెరిగాయి.  గృహ వినియోగ సిలిండర్ల ధరలో మార్పు లేదు.

PREV
15
సిలిండర్ ధర పెంపు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఆధారపడి ఉంటాయి. వీటిలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి కానీ. వంటకు ప్రధానంగా కావాల్సిన గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం చాలా అరుదుగా పెరుగుతాయి. ఇప్పుడు ముడి చమురు ధరలకు తగ్గట్టు వంట గ్యాస్ సిలిండర్ ధరలు నిర్ణయించేందుకు చమురు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

25
ధరలు ఇలా

కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే  చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను మారుస్తూ ఉంటాయి. చాలా నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అదే సమయంలో, వంట గ్యాస్ సిలిండర్ల ధరను ప్రతి నెలా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తున్నారు. కానీ ధరలు ఎక్కువగా పెంచరు.

35
ప్రతి నెలా 1వ తేదీన

చమురు కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీనకొత్త ధరలను నిర్ణయిస్తూ ఉంటాయి. గత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో  గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ వచ్చారు. ఈ నెల కూడా ధర తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ  ప్రజలకు షాక్ తగిలింది. ఆరు నెలల తర్వాత గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే ఇంట్లో వాడేవారికి ఎలాంటి సమస్యా లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన మాత్రమే ధరలు పెంచారు.

45
ఎంత పెంచారు?

అక్టోబర్ 1న అంటే ఈ రోజు నుంచి చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర నిన్న రూ.1,754 ఉండగా, నేడు రూ.16 పెరిగి రూ.1,770కి చేరింది. ఈ ధరల పెంపు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. 

55
వీరికి సమస్య లేదు

కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచారు కాబట్టి గృహ వినియోగ సిలిండర్లు వాడే వారికి ఎలాంటి సమస్యా లేదు.  గృహ వినియోగ సిలిండర్ ధర రూ.868.50గా ఉంది. గత కొన్ని నెలలుగా గృహ వినియోగ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. మన దేశంల వీటిని వాడే వారే కోట్లలో ఉంటారు. కాబట్టి సిలిండర్ ధర పెంపు వీరిపై ప్రభావాన్ని చూపించదు.

Read more Photos on
click me!

Recommended Stories