బ్యాంకుల నుండి వాట్సాప్ వరకు మారనున్న రూల్స్ ఇవే.. నేటి నుంచి అమలులోకి..

First Published Nov 1, 2021, 3:27 PM IST

1 నవంబర్  2021 నుండి ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మార్పులు మీ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు. ఒకవైపు ఈ కొత్త నిబంధనల(new rules) నుంచి ఉపశమనం లభిస్తుండగా, మరోవైపు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థికంగా కూడా నష్టపోవచ్చు.

ఈ నియమాలలో మార్పులు మీ సేవింగ్స్  పై ప్రభావం చూపుతాయి ఇంకా మీ ఇంటి బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన మార్పులు ఏంటంటే..?

గ్యాస్ సిలిండర్ ధర 
నవంబర్ 1వ తేదీన అంటే నేడు వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసేంది. ఇప్పుడు 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 266లు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధర 2 వేలకు  చేరింది. హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1905.32కి చేరగా  పెంచిన ధరలు నేటి నుంచి అమలులో ఉంటాయి. నివేదిక ప్రకారం, ఎల్‌పిజి సిలిండర్ ను తక్కువ ధరకు విక్రయించడం వల్ల వచ్చే నష్టం (అండర్ రికవరీ) సిలిండర్‌కు రూ. 100కి చేరుకుంది. ఈ కారణంగా,  ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.899.50గా ఉంది.

పెట్టుబడిదారుల కోసం ఐ‌పి‌ఓల ఓపెన్
నవంబర్ 1 నుండి  ఐ‌పి‌ఓలో పెట్టుబడి పెట్టడానికి చూస్తున్న గొప్ప గూప్పఅవకాశాలను తెస్తోంది. పాలసీబజార్ ఐ‌పి‌ఓ నవంబర్ 1 నుండి ఓపెన్ కానుంది. దీనితో పాటు  ఎస్‌జే‌ఎస్ ఎంటర్‌ప్రైజ్, సిగాచి ఇండస్ట్రీస్ ఐ‌పి‌ఓ కూడా నేటి నుండి తెరవబడుతుంది. పేటి‌ఎం IPO నవంబర్ 8న ప్రారంభించనుంది.
 

బ్యాంకింగ్ నియమాలు 
ఇప్పుడు బ్యాంకులలో మీరు డబ్బును డిపాజిట్ చేయడానికి, విత్‌డ్రా చేయడానికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా  ఈ నియమాన్ని ప్రారంభించింది. వచ్చే నెల నుండి నిర్ణీత పరిమితికి మించిన బ్యాంకింగ్  సౌకర్యాలకు ప్రత్యేక రుసుమును చార్జ్ చేయనుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఖాతాదారులు లోన్ ఖాతా కోసం రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారులకు మూడు సార్లు వరకు డిపాజిట్ ఉచితం, అయితే ఖాతాదారులు నాల్గవసారి డబ్బును డిపాజిట్ చేస్తే రూ.40 చార్జ్ చెల్లించాలి. మరోవైపు, జన్ ధన్ ఖాతాదారులకు ఈ నియమంలో కొంత ఉపశమనం పొందారు, వారు డిపాజిట్‌పై ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

పెన్షనర్లకు ఉపశమనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 1 నుండి కొత్త సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది. దీని ప్రకారం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏ పెన్షనర్ అయినా వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్  సమర్పించవచ్చు. 

వాట్సప్ 
నవంబర్ 1 నుండి అంటే  నేటి నుంచి మెసేజింగ్ యాప్ వాట్సప్ కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయడం ఆగిపోతుంది. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌  ఔట్ డేట్ తో రన్ అవుతుంటే అందులో వాట్సాప్ పనిచేయడం ఆగిపోవచ్చు. ఈ ఫోన్‌ల జాబితాలో  ఆపిల్ నుండి సాంసాంగ్, సోని వరకు పెద్ద కంపెనీలు స్మార్ట్ ఫోన్లు  కూడా ఉన్నాయి.

 నవంబర్ లో బ్యాంకులు బంద్ 
నవంబర్ నెలలో బ్యాంకులకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు, పనులు చేసుకోవాలంటే ముందుగా సెలవుల జాబితా తెలుసుకోవాలి. ఎందుకంటే నవంబర్‌లో దీపావళి, ఛత్ తదితర పండుగల కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూతడనున్నాయి

ప్రత్యేక రైళ్లు 
దీపావళి, ఛత్ పండుగ దృష్ట్యా సొంత ఇంటికి వెళ్లడం ఇప్పుడు సులభం కానుంది, ఎందుకంటే ఇండియన్ రైల్వే కొత్తగా ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. కొన్ని రైళ్లు నవంబర్ నెలలో వేర్వేరు తేదీల్లో ప్రయాణించడం ప్రారంభిస్తాయి. దేశంలోని వివిధ మార్గాల్లో ఈ రైళ్లు నడపనున్నాయి.  

click me!