మహిళలకు ఫ్రీ LPG గ్యాస్ సిలిండర్.. ఈ స్కిం ఏంటో తెలుసా? ఎలా పొందవచ్చంటే ?

First Published | Apr 15, 2024, 2:05 PM IST

2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారిద్య్రరేఖ(poverty line)కు దిగువన ఉన్న మహిళలు వంట చేయడంలో ఇబ్బందులు పడకుండా చేసింది. ఇందుకు కోసం ఉజ్వల ప్రాజెక్టును ప్రారంభించారు. ఉజ్వల పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తారు. ఈ  పథకంలో గ్యాస్ స్టవ్ కూడా ఉంది.
 

BPL కార్డ్ ఉన్న మహిళలు మాత్రమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలను పొందగలరు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలు ఇంతకుముందు  ఎలాంటి LPG కనెక్షన్‌ తీసుకొని  ఉండకూడదు. అలాగే ఆడవారి వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఇందులో మహిళలు వారికీ  నచ్చిన  ఏజెన్సీని ఎంచుకునే హక్కును పొందుతారు.
 

వీటిలో భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ అండ్  ఇండియన్ గ్యాస్ ఉన్నాయి. ఈ మూడింటిలో సెలెక్ట్  చేసుకున్న  ఏజెన్సీల ద్వారా మాత్రమే మహిళలకు సిలిండర్లు అందజేస్తున్నారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ  పథకం పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్  pmuy.gov.inని చూడవచ్చు.
 

Latest Videos


దీని తర్వాత, మీరు హోమ్ పేజీ మెనూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు డౌన్‌లోడ్ ఫారమ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడిగిన  సమాచారాన్ని నింపాలి. అలాగే అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. దీని తర్వాత, మీరు సమీప ఏజెన్సీలో ఫారమ్‌ను సబ్మిట్ చేయడం ద్వారా ఈ పథకం ప్రయోజనాలని పొందవచ్చు.
 

 ఈ ఫారమ్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి కూడా నింపవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి కుల ధృవీకరణ పత్రం(caste certificate), BPL రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం(income certificate), నివాస ధృవీకరణ పత్రం(residency certificate), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తప్పనిసరి.
 

click me!