ఒంటిపై కిలోల కొద్దీ బంగారం.. ఎక్కువగా ధరించే వారు వీరే.. కారు, షూ, పౌచ్ కూడా గోల్డ్..

First Published | Apr 10, 2024, 3:16 PM IST

న్యూఢిల్లీ :  మన దేశంలో అత్యధికంగా  వంటి పై బంగారు ఆభరణాలు ధరించే టాప్-10 గోల్డ్ మేన్స్ వీరే...,  వీరందరూ 5 నుంచి 10 కిలోల బంగారు నగలు ధరించి తిరిగే అలవాటు ఉన్నవారు.  వీరిని వాకింగ్  గోల్డ్ షాప్స్ అని  అంటారు. 

హర్షవర్ధన్ పాండేకర్ భారతదేశపు అత్యంత చిన్న  వయస్కుడైన గోల్డెన్ మ్యాన్. వయసులో చిన్నవాడైన ఇతను  ఏదైనా కార్యక్రమానికి వెళ్లినప్పుడు 10 నుంచి 12 కిలోల బంగారు ఆభరణాలను వంటిపై ధరిస్తారు. ఇతను  పూణేకి చెందినవాడు.

అత్యధిక బంగారు ఆభరణాలు ధరించిన వారిలో దీపక్ పొకాలే 9వ స్థానంలో ఉన్నారు. అతని మెడలో చాలా పెద్ద గొలుసులు అందులో  ఒక గొలుసుపై పప్పా అండ్ 9 అనే మందపాటి లాకెట్‌ ఉంటుంది. అతని చేతి 10 వేళ్ళు కూడా బంగారంతో నిండి ఉంటాయి.
 


మహారాష్ట్రలోని పూణెకు చెందిన దత్తాత్రేయ ఫుగే అనే మరో వ్యక్తి కూడా గోల్డ్  మేన్స్ లో ఒకరు. అతను దాదాపు 6.5 కిలోల బంగారు ఆభరణాలు ధరించేవాడు, తాజాగా 3.5 కిలోల గోల్డ్  షర్ట్  కూడా  ధరించాడు.
 

పుణెకు చెందిన అక్షయ్ బర్నీ దేశంలో అత్యంత ఆభరణాలు ఉన్న వ్యక్తులలో 10వ స్థానంలో ఉన్నాడు. అతనికి  లగ్జరీ కార్స్ కూడా   ఉన్నాయి.   పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాల కోసం తలపై 3 నుండి 6 కిలోల బంగారు ఆభరణాలను ధరిస్తాడు. అతనికి సెక్యూరిటీ కూడా ఉంటుంది.
 

మహారాష్ట్ర పూణేలో ఉన్న మల్లవ్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్  డైరెక్టర్  నిషికాంత్ మల్లవ్ బంగారు ఆభరణాలు ధరించి రీల్స్ చేస్తూ  పాపులారిటీ  పెంచుకున్నాడు.
 

పూణే మల్లవ్ అండ్ సన్స్ ప్రై లిమిటెడ్   డైరెక్టర్ నిషికాంత్ మల్లవ్ సోదరుడు ఆకాష్ మల్లవ్ కూడా బంగారు ఆభరణాలు ధరించడం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆకాష్, నిషికాంత్‌లను గోల్డెన్ బ్రదర్స్ అని కూడా పిలుస్తారు.
 

సంజయ్ గుజార్ ఒక భారతీయ వ్యాపారవేత్త, హీరో, మోడల్ అండ్  ఫిల్మ్ ఫైనాన్షియర్. నిజానికి మహారాష్ట్రలోని  సంజయ్ గుజార్ అండ్ భారతీయ వ్యాపారవేత్త సన్నీ వాఘ్‌చౌరే సన్నిహిత స్నేహితులు. వీరిద్దరినీ గోల్డెన్ గైస్ ఆఫ్ ఇండియా అంటారు. 
 

పూణేకు చెందిన ప్రశాంత్ లక్ష్మణ్ సప్కల్ అనే మరో వ్యక్తి కూడా బంగారు ఆభరణాలు ధరించే వారిలో ఒకరు. సాధారణ రోజుల్లో కూడా 5 కిలోల కంటే తక్కువ బరువు ఆభరణాలను  ధరిస్తుంటారు. ఇతను పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ అనే సంస్థను కూడా  ప్రారంభించాడు.
 

తలపై 6 కిలోల నుండి 8 కిలోల బంగారాన్ని ధరించే వైభవ్ బోరాటేని  ఇండియన్  గోల్డ్ మెన్  అని కూడా పిలుస్తారు. అతనికి ఎక్కువగా ఖరీదైన ఇంకా  లగ్జరీ  కార్లను సేకరించడం హాబీ.
 

సన్నీ వాఘ్‌చౌరే ఒక భారతీయ వ్యాపారవేత్త అండ్  సినిమా ఫైనాన్షియర్. పూణే గోల్డ్ మెన్ గా పేరు పొందాడు. ఆతను  34 సంవత్సరాల వయస్సులోనే అత్యధిక బంగారు ఆభరణాలు ధరించారు. ఇంకా బిగ్ బాస్ హిందీ 16వ సీజన్‌లో కూడా కనిపించాడు. అతని కారు, షూ, మొబైల్ కవర్ కూడా బంగారంతో తయారు చేసి ఉంటుంది.
 

Latest Videos

click me!