అల్లు అర్జున్ సినిమాలే కాకుండా ఇంకేం చేస్తాడో తెలుసా.. ఒక్కటి కాదు ఏడూ..

First Published | Apr 10, 2024, 1:18 PM IST

టాలీవుడ్ స్టయిలిష్  స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న అగ్రగామి పేరు. గత ఏడాది బన్నీ నటించిన పుష్ప సినిమా యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చి పెట్టింది. ఇండస్ట్రీలో అతను నటించిన ప్రతి సినిమా ఎంతో మందిని ఆకట్టుకుంది కూడా. అయితే అల్లు అర్జున్ హీరోగా కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా వివిధ రంగాల్లోను పెట్టుబడులు పెట్టారు. 

తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో 42 ఏళ్ల అర్జున్ కూడా ఒకరు. బహిరంగంగా ఉన్న సమాచారం ప్రకారం, అతని మొత్తం విలువ రూ. 460 కోట్లు. సమాచారం ప్రకారం పుష్ప-1కి 45 కోట్లు, పుష్ప-2కి 85 కోట్లు పారితోషికం  తిసుకున్న  ఈ హీరో మొత్తం  విలువ ఇంకా ఎక్కువగా ఉండటంలో కూడా ఆశ్చర్యం లేదు. ప్రైవేట్ జెట్, విలాసవంతమైన బంగ్లా, అనేక ఆస్తులు, మెరిసే కార్లు ఇంకా  లగ్జరీ  లైఫ్ స్టయిల్  గడుపుతున్న ఈ హీరో  ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో  తెలుసా...

1. ప్రొడక్షన్ హౌస్
2022లో అల్లు అర్జున్ హైదరాబాద్‌లో అల్లు స్టూడియో అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి, దానిని వాల్ల   తాత అల్లు రామలింగయ్యకు అంకితం చేశారు. ఈ స్టూడియో 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఫిల్మ్ మేకింగ్, కమర్షియల్ ప్రొడక్షన్ ఇంకా టెలివిజన్‌లో ఉపయోగించే సరికొత్త టెక్నాలజీ  ఇక్కడ ఉంది. అల్లు స్టూడియోతో పాటు, అల్లు కుటుంబానికి గీతా ఆర్ట్స్ అనే చిత్ర నిర్మాణ అలాగే  డిస్ట్రిబ్యూషన్  సంస్థ కూడా ఉంది.

Latest Videos


2. మల్టీప్లెక్స్
అల్లు అర్జున్ జూన్ 2023లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో తన సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడం ద్వారా వ్యాపారాన్ని  విస్తరించాడు. వివిధ ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, అల్లు  అర్జున్  తన మల్టీప్లెక్స్ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలలోకి కూడా విస్తరించాలని యోచిస్తున్నాడు. 

3. హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పాపులర్ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ బఫెలో వైల్డ్ వింగ్స్  ఫ్రాంచైజీ ఈ  తెలుగు సూపర్ స్టార్ కి ఉంది.

4. సోషల్ మీడియా పోస్ట్‌లు
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న 42 ఏళ్ల అల్లు అర్జున్  (ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్లకు పైగా ఫాలోవర్లు), ఆన్‌లైన్‌లో ప్రతి  పోస్ట్‌కు పెద్ద  మొత్తంలో డబ్బు ఛార్జ్  చేస్తున్నారు.

5. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్
అల్లు అర్జున్ KFC, Frooti, ​​Rapido, Hero MotoCorp, RedBus, Hotstar  ఇంకా  ఇతర ప్రముఖ దేశీయ అలాగే అంతర్జాతీయ బ్రాండ్‌లతో అనుబంధం  ఉంది. ఈ తెలుగు హీరో  ఒక్కో బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి దాదాపు రూ.4 కోట్లు  తీసుకుంటున్నట్లు కొన్ని నివేదికల  సమాచారం. 
 

6. OTT ప్లాట్‌ఫారమ్ (aha)
నవంబర్ 2020లో, అల్లు అర్జున్ తెలుగు, తమిళ కంటెంట్‌ను అందించే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్థాపించారు.

7. స్టార్టప్‌లలో పెట్టుబడులు
అల్లు అర్జున్ హైదరాబాద్ ఆధారిత కాల్ హెల్త్ సర్వీసెస్‌లో పెట్టుబడి పెట్టారు – ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్‌లు, నర్సింగ్ కేర్, డయాగ్నొస్టిక్ టెస్ట్‌లు, డ్రగ్ డెలివరీ అండ్  ఇతర హెల్త్‌కేర్ సొల్యూషన్స్ వంటి వివిధ సేవలను అందించేది  ఈ హెల్త్‌కేర్ స్టార్టప్.

click me!