Free calling: మీ ఫోన్ లో ఈ ఒక్క ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్?

Published : Feb 07, 2025, 05:09 PM IST

ప్రస్తుతం ఎవ్వరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటోంది. చిన్న,పెద్ద తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. కానీ ఫోన్ వాడాలంటే రీఛార్జ్ తప్పనిసరి కదా. మాములుగా అయితే రీఛార్జ్ చేసుకోకపోతే ఫోన్ కాల్స్ చేయలేము. కానీ ఎలాంటి రీఛార్జ్ లేకుండానే ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అది ఎలాగో తెలుసుకోండి మరి.

PREV
14
Free calling: మీ ఫోన్ లో ఈ ఒక్క ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్?

దేశవ్యాప్తంగా చాలా మంది ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL నెట్ వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. కాల్స్, SMS లు చేయాలంటే ప్రతినెలా రీఛార్జ్ తప్పనిసరి. కానీ ఎలాంటి రీఛార్జ్ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. 

మీ నంబర్‌ పని చేస్తూ ఉండటానికి, ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండా యాక్టివ్ ఉచిత కాల్స్ పొందడానికి ఒక ట్రిక్ ఉంది. దీనికి కావాల్సింది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, వైఫై కాలింగ్. ఈ ఫీచర్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు అనవసరమైన రీఛార్జ్‌లను నివారించడంలో సహాయపడుతుంది.

24
రీఛార్జ్ లేకపోయినా కాల్స్..

ప్రస్తుతం వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు చాలా వరకు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. దీని ద్వారా వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసినా.. ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు కాల్స్ చేయడం కొనసాగించవచ్చు.

34
WiFi కాల్స్ ఆక్టివేషన్ ఇలా

తరచుగా బ్యాలెన్స్ అయిపోయి రీఛార్జ్ చేయడానికి కుదరనప్పుడు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. WiFi కాల్స్ ఆక్టివేషన్ ఇలా చేసుకోండి.

1: మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
2: నెట్‌వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
3: SIM కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ని ఎంచుకోండి.
4: మీరు కాల్స్ కోసం ఉపయోగించే SIM కార్డ్‌ని ఎంచుకోండి.
5: ఆపై కింద WiFi కాల్స్ టోగుల్‌ని కనుగొనండి.
6: WiFi కాల్స్‌ని యాక్టివేట్ చేయండి.

44
ఆటోమెటిక్ గా..

ఈ ట్రిక్ యాక్టివేట్ అయిన తర్వాత, మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్స్ కోసం ఆటోమెటిక్‌గా వైఫైను ఉపయోగిస్తుంది.

click me!

Recommended Stories