రూ. 3599 ప్లాన్
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్‌తో పాటు రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. అదే విధంగా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందిస్తారు. ఇక వీటికి అదనంగా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి సేవలను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రూ. 1500 విలువైన ఈజీమై ట్రిప్ ఓచర్, రూ. 1000 అజియో, రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్‌ను పొందొచ్చు. నెల లెక్కన చూసుకుంటే రూ. 276 చెల్లించాల్సి ఉంటుంది.