నగరాలను బట్టి ఛార్జ్ మారుతుంది
నెలకు ఉచిత ATM మనీ విత్ డ్రా సదుపాయాల సంఖ్య బ్యాంకును బట్టి, నగరాన్ని బట్టి కూడా మారుతుంది. మీరు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో నివసిస్తుంటే నెలకు మూడు ఉచిత ATM నగదు ఉపసంహరణలను పొందవచ్చు.
అయితే మీరు చిన్న నగరాలు లేదా మెట్రో కాని ప్రాంతాల్లో నివసిస్తుంటే మీరు నెలకు ఐదుసార్లు ఉచితంగా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితిని మించిపోయిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి కొత్త రూ.23 ఛార్జీ వర్తిస్తుంది.