మహిళలకు ఫ్రీగా రూ.10 లక్షల రుణం

First Published | Jul 23, 2024, 2:23 PM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్‌లో మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యమిచ్చారు. వారి స్వయం అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆర్థిక సహాయమూ అందనుంది. 

Mudra Loans

2024-25 బడ్జెట్‌లో మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ అనేక కొత్త పథకాలను ప్రకటించారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకం కింద మహిళలకు రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. దీంతో చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి, ఇంకా విస్తరించడానికి మహిళలకు మరింత ప్రోత్సాహం అందనుంది. 

Atmanirbhar Bharat for women

మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడానికి, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా మహిళా సహకార సంఘాలను, స్టార్టప్‌లను ప్రోత్సహించే పథకాలను నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం అందుతాయి.


₹ 3 lakh crore for schemes benefitting women and girls

దేశంలోని మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం 2024 బడ్జెట్‌లో మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులు మహిళా సంక్షేమ పథకాల అమలుకు, వారి పురోగతికి ఉపయోగపడతాయి.

Latest Videos

click me!