ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. నిర్మలా సీతారామన్ వరసగా 7వసారి ఈ బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం విశేషం. ఈ బడ్జెట్ లో భాగంగా చాలా వస్తువుల ధరలు తగ్గాయి. చాలా వస్తువుల పెరిగాయి. మరి.. ఆ పెరిగిన, తగ్గిన వస్తువులు ఏంటో ఓసారి చూసేద్దామా...
బడ్జెట్ లో భాగంగా. భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీని పెంచే ప్రయత్నంలో.. కెమెరా లెన్స్ లతో సహా వివిధ భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. అంతేకాకుండా.. ఫోన్‌లు , ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గించారు. ఈ విధాన మార్పు భారతదేశంలో ఫోన్‌లను తయారు చేసే కంపెనీల సంఖ్యను పెంచుతుందని, దీంతో.. ధరలు తగ్గుతాయి.
UNION BUDGET 2024 - MOBILE
ధరలు తగ్గే వస్తువుల జాబితా ఇదే...
1.మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై పన్నును దాదాపు 15 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు.
UNION BUDGET 2024 - GOLD
2.బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినం పై 6.4 శాతానికి తగ్గించారు.
3.క్యాన్సర్ చికిత్స మందులు, ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు.
4.ఫెర్రో నికిల్, బ్లిస్టర్ కాపర్ పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
5.చౌకగా లభించనున్న లెదర్ వస్తువులు, సీఫుడ్
ధరలు పెరిగే వస్తువులు..
అమ్మోనియం నైట్రేట్‌పై 10% కస్టమ్స్ సుంకం,
నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్‌కు 25% పెంపుదల కూడా బడ్జెట్‌లో ప్రకటించారు. అంటే.. ప్లాస్టిక ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ 25శాతం పెరగనున్నాయి.
టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 15శాతానికి పెంపు