ఫ్యూచర్ రిటైల్ 7-ఎలెవెన్‌తో ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ఆర్‌ఆర్‌విఎల్ ప్రకటన వచ్చింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, "7-ఎలెవెన్ అనేది కన్వీనియెన్స్ రిటైల్ ల్యాండ్‌స్కేప్‌లో అత్యంత ప్రసిద్ధ ప్రపంచ బ్రాండ్‌లలో ఒకటి. ఎస్‌ఈఐ (SEI)తో కలిసి మేము నిర్మించే కొత్త మార్గాలు భారతీయ వినియోగదారులకు వారి పరిసరాల్లో ఎక్కువ కన్వీనియెన్స్, ఛాయిస్ అందిస్తాయి.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) గురించి:
ఆర్‌ఆర్‌విఎల్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. అన్ని రిటైల్ కంపెనీలు ఆర్‌ఐఎల్ గ్రూప్ కిందకు వస్తాయి. ఆర్‌ఆర్‌విఎల్ టర్నోవర్ రూ.157,629 (21.6 బిలియన్ డాలర్లు) కోట్లు, 31 మార్చ్ 2021తో ముగిసిన సంవత్సరానికి నికర లాభం రూ. 5,481 కోట్లు ( 750 మిలియన్ల డాలర్లు). ఆర్‌ఆర్‌విఎల్ భారతదేశంలో అతిపెద్ద, అత్యంత లాభదాయకమైన రిటైలర్. డెలాయిట్ గ్లోబల్ పవర్స్‌లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్‌ల జాబితా నిలిచింది. రిటైలింగ్ 2021 ఇండెక్స్ లో టాప్ గ్లోబల్ రిటైలర్ల జాబితాలో 53వ స్థానం పొందింది. అంతేకాదు టాప్ 100లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రిటైలర్.