Gold Rate: భారత్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం చూశాం. కొన్ని రోజులుగా బంగారం ధరలు మెల్లగా తగ్గుతున్నాయి. అయితే ఆర్ధిక నిపుణులు మాత్రం బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మనదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డిమాండ్ కూడా అధికంగా ఉండడంతో బంగారం దిగుమతులు అధికంగా చేయాల్సి వచ్చింది. దీనితో అధిక ధరకు బంగారాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చేంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల కోత, కొత్త సుంకాలు, అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల బంగారం ధర అలా పెరుగుతూ కొండెక్కి కూర్చుంది. కానీ కొన్ని రోజులుగా మాత్రం బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది.
26
సెంట్రల్ బ్యాంకులు బంగారం ఎందుకు కొంటున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొంటున్నాయి. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికే ఇలా చేస్తున్నాయి. అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయాలనేది పెద్ద దేశాల ఆలోచన. గత ఏడాదిలో భారత్ తన బంగారం నిల్వలను 9.6 శాతం నుంచి 13.1 శాతానికి పెంచుకుంది. రష్యా కూడా 29.5 శాతానికి నుంచి 35.8 శాతానికి పెంచింది.
36
ఆర్‌బీఐ దగ్గర ఎంత బంగారం ఉంది?
2025-26 ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, బంగారం నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. 2024-25 చివరి నాటికి 879.58 మెట్రిక్ టన్నులు ఉండేవి. 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆర్‌బీఐ 600 కేజీల బంగారాన్ని తన నిల్వలకు చేర్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ 54.13 మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోలు చేసింది
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం రూ.9,000, వెండి రూ.22,000 వరకు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా, స్పాట్ గోల్డ్ 0.53% తగ్గి ఔన్సుకు 4102.09 డాలర్లుగా ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 48.82 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
56
నిపుణులు చెప్పినట్లే జరిగింది
బంగారం-వెండి ధరలు నిరంతరం పెరగడం చిన్న పెట్టుబడిదారులకు పెద్ద నష్టమని నిపుణులు చెప్పారు. అందుకే ఇప్పుడు బంగారం-వెండి ధరలు తగ్గుతున్నాయని అంటున్నారు. ఆసియా, ప్రపంచ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
66
రెడ్ అలర్ట్ ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొంటున్నాయి. దీన్ని ఒకరకమైన గ్లోబల్ రెడ్ అలర్ట్‌గా పిలుస్తున్నారు. బంగారం ధర ఊహించని విధంగా పెరిగింది. ఇది పెరుగుదల కన్నా హెచ్చరిక గంట. ఈ పెరుగుదల 2008 ఆర్థిక మాంద్యం, కోవిడ్-19 సంక్షోభాలను గుర్తుచేస్తుంది.