IRCTC: ఇకపై కొన్ని రైళ్లలో డయాబెటిక్ పేషెంట్ల కోసం ప్రత్యేక మీల్స్, అది కూడా సాధారణ ధరకే

Published : Nov 02, 2025, 09:32 AM IST

IRCTC: డయాబెటిస్ రోగులకు శుభవార్త.  రైలు ప్రయాణం సమయంలో వారికి ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా ప్రత్యేక మీల్స్ అందించబోతున్నారు. అది కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే.   

PREV
14
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. మన దేశంలో లాభాల్లో ఉన్న సంస్థగా భారతీయ రైల్వే నిలిచింది. తాజాగా ఐఆర్‌సిటీసీ డయాబెటిక్ రోగుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వారు రైలు ప్రయాణ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కోసం ప్రత్యేక ఆహారం అందించేందుకు సిద్ధమైంది.  ఇకపై రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ఈ ఆహారాన్ని అందించనుంది. ఇందుకోసం అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయరు.  టికెట్ బుక్ చేసేటప్పుడే ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకోవచ్చు.  ఇప్పటికే రైల్వే బోర్డు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.

24
మనదేశంలోనే ఎక్కువ

భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు.  ఎందుకంటే మనదేశంలో సుమారు 22 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య ప్రతిఏడాది పెరుగుతూనే వస్తోంది. యువతలో కూడా ఈ వ్యాధి ఎక్కువమందికి వస్తోంది. అందుకే రైల్వే ఈ కొత్త మీల్స్ ప్రాజెక్టును మొదలుపెట్టింది.

34
ఎలాంటి ఫుడ్ రకాలు?

రైల్వే బోర్డు జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం కొన్ని రైళ్లలోనే డయాబెటిక్ మీల్స్ అందుబాటులో ఉంటాయి.  రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ సహా అన్ని ప్రీ-పెయిడ్ రైళ్లలో ఐదు రకాల ఆహార ఎంపికలు ఉంటాయి. అవి శాకాహారం, మాంసాహారం, జైన్ ఫుడ్, డయాబెటిక్ వెజ్, డయాబెటిక్ నాన్-వెజ్. ఇందులో మీకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు.

44
అదనంగా వసూలు చేయరు

 ప్రయాణికులు కావాలనుకుంటే రైలు ఎక్కాక కూడా ఆహారాన్ని ఎంపికచేసుకోవచ్చు. లేదా వద్దని చెప్పవచ్చు. టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా ఫుడ్ ఆప్షన్‌ను మార్చుకోవచ్చు. ఈ పథకం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ ఆహారానికి లేదా పానీయాలకు అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories