పండుగ సీజన్ ఆఫర్... ఆ కార్లపై లక్ష రూపాయలకు పైగా భారీ డిస్కౌంట్, ఇప్పుడే కొనేయండి

Published : Oct 05, 2026, 08:38 AM IST

పండుగ సీజన్ వచ్చేసింది. దసరా, దీపావళి ఇలా వరుసపెట్టి పండుగలే ఇక. అయితే మారుతి సుజుకి తన కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఒక్కో కారుపై లక్ష రూపాయలకుపై తగ్గింపు ఇస్తోంది.

PREV
13
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్

మారుతి సుజుకి పండుగ సీజన్‌లో అమ్మకాలు పెంచుకునేందుకు పెద్ద ప్లానే వేసింది. లక్ష రూపాయలకు పైగా తగ్గింపును ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తోంది. అక్టోబర్ 2026లో నెక్సా మోడల్ కార్లపై కంపెనీ స్పెషల్ డిస్కౌంట్లను ప్రకటించింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. గ్రాండ్ విటారా కారుపైనే కంపెనీ అత్యధిక డిస్కౌంట్ ఇస్తోంది. దీనిలోని వేరియంట్లపై లక్ష నుంచి రూ.1.36 లక్షల వరకు లాభం పొందొచ్చు. అంతేకాదు, నవరాత్రికి ముందు అక్టోబర్ 1 నుంచి 10 వరకు కొన్ని మోడళ్లపై స్పెషల్ బుకింగ్ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది.

23
గ్రాండ్ విటారాపై రూ.1.36 లక్షల వరకు ఆఫర్

మారుతి సుజుకి గ్రాండ్ విటారాపై భారీ డిస్కౌండ్ ఇస్తోంది. ఇందులో సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.36 లక్షలు, డెల్టా పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.26 లక్షల వరకు ఆఫర్ ఉంది. జీటా, ఆల్ఫా వేరియంట్లపై రూ.1.15 లక్షల డిస్కౌంట్‌తో పాటు 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఇస్తోంది. ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌కు కూడా ఇవే ఆఫర్లు వర్తిస్తాయి. ఇక గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై షరతులకు లోబడి రూ.1.85 లక్షల వరకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు, 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని కంపెనీ ఇస్తోంది. గ్రాండ్ విటారా కారును సొంతం చేసుకోవడానికి ఇదే మంచి సమయం.

33
డిస్కౌంట్ ఎలా ఇస్తారు

గ్రాండ్ విటారాలో సీఎన్‌జీ (CNG), జీటా సీఎన్‌జీ మోడళ్లపై రూ.90,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక పాపులర్ అయిన ఫ్రాంక్స్ (Fronx) మోడల్‌పై కూడా తగ్గింపు ఇస్తోంది. టర్బో పెట్రోల్ వేరియంట్‌పై రూ.27,100, 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.22,100 వరకు ఆఫర్ ఉంది. ఫ్రాంక్స్ సీఎన్‌జీ మోడల్‌పై రూ.15,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. మారుతి సుజుకి ప్రీమియం ఎంపీవీ XL6 పెట్రోల్ వేరియంట్‌పై రూ.61,000, సీఎన్‌జీపై రూ.50,000 వరకు ఆఫర్ ఉంది. ఇన్విక్టో (Invicto) అన్ని వేరియంట్లపై రూ.95,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జిమ్నీ (Jimny) అన్ని వేరియంట్లపై రూ.35,000 వరకు డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది.

మారుతి సుజుకి ప్రకటించిన ఈ డిస్కౌంట్ మొత్తం డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ కాదు. ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్లన్నీ కలిపి ఈ మొత్తాన్ని లెక్కించారు. కంపెనీ నిబంధనల ప్రకారం, కస్టమర్లు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్లలో తమకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories