పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..

Published : Sep 02, 2026, 10:07 PM IST

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే వారికి శుభవార్త. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఎంపిక చేసిన కాలపరిమితులపై FD వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ ప్రయోజనం లభిస్తోంది. ఇంత‌కీ ఆ బ్యాంకులు ఏంటంటే.?

PREV
15
హెచ్‌డీఎఫ్‌సీలో పెరిగిన FD వడ్డీ

HDFC బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వడ్డీ రేటును పెంచింది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీని 0.10 శాతం పెంచింది. గతంలో ఈ కాలపరిమితిలో సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభించేది. ఇప్పుడు దానిని 7.10 శాతానికి పెంచారు. ఈ కొత్త రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

HDFC బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు FD కాలపరిమితిని బట్టి 3.25 శాతం నుంచి గరిష్టంగా 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FDలపై 6.65 శాతం వడ్డీ అందుతోంది. సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.

25
ఫెడరల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీ

ఫెడరల్ బ్యాంక్ కూడా రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు అందుతున్న కొన్ని ముఖ్యమైన FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 నుంచి 29 రోజులకు 3.50%గా ఉండ‌గా, 30 నుంచి 45 రోజులు 3.75%, 46 నుంచి 90 రోజులకు 4.75%, 91 నుంచి 180 రోజులకు 5%, 181 రోజులకు 6.50%, ఏడాదికి 6.75%, 1 సంవత్సరం కంటే ఎక్కువ నుంచి 15 నెలల లోపు 6.90%, 15 నెలలకు గాను 7.15%, 15 నుంచి 24 నెలలకు 6.90%, 24 నెలల కంటే ఎక్కువ నుంచి 48 నెలల లోపు పెట్టుబ‌డికి 7%, 48 నెలలకు 7.20% వ‌డ్డీ ల‌భిస్తుంది. అదే 48 నెలల కంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వ‌ర‌కు 6.90% వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

35
ఏ FD కాలపరిమితిలో ఎక్కువ వడ్డీ వస్తోంది?

ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు 48 నెలల FDపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీ లభిస్తోంది. మరోవైపు HDFC బ్యాంక్‌లో 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు FDపై 7.10 శాతం వడ్డీ అందుతోంది. అయితే కేవలం అత్యధిక వడ్డీ రేటు ఉందని చూసి పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. మనకు ఆ డబ్బు ఎప్పుడు అవసరం అవుతుంది, ఎంతకాలం పెట్టుబడి పెట్టగలం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. FDలో పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవడం మంచిది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ అవసరాలకు తగ్గ కాలపరిమితిని ఎంచుకోవాలి.

45
పాత FDని రద్దు చేసి కొత్త FD చేయాలా?

కొత్తగా వడ్డీ రేట్లు పెరిగాయని చూసి ఇప్పటికే ఉన్న FDని వెంటనే రద్దు చేయడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. FDని గడువు ముగియకముందే రద్దు చేస్తే బ్యాంకులు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. దీంతో పెరిగిన వడ్డీ రేటు వల్ల వచ్చే అదనపు ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ కావచ్చు. పాత FDని రద్దు చేసే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా లెక్కించాలి. ప్రస్తుతం మీ FDపై ఎంత వడ్డీ వస్తోంది? FD మెచ్యూరిటీకి ఇంకా ఎంత సమయం ఉంది? కొత్త FDపై ఎంత అదనపు వడ్డీ లభిస్తుంది? ముందుగానే FD రద్దు చేస్తే ఎంత పెనాల్టీ పడుతుంది? వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాతే పాత FDని రద్దు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.

55
FDలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

FDలు సురక్షిత పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా భావించినప్పటికీ సరైన కాలపరిమితిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే డబ్బును ఎక్కువ కాలం FDలో పెట్టకుండా ఉండటం మంచిది.

అలాగే ఒకేసారి మొత్తం డబ్బును ఒకే FDలో పెట్టడం కంటే, అవసరాలను బట్టి వేర్వేరు కాలపరిమితుల్లో FDలు చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల అవసరమైన సమయంలో మొత్తం FDని రద్దు చేయాల్సిన అవసరం ఉండదు.

మొత్తానికి, HDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ తాజా వడ్డీ రేట్ల పెంపు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా మారింది. అయితే కేవలం ఎక్కువ వడ్డీ వస్తుందనే కారణంతో నిర్ణయం తీసుకోకుండా, కాలపరిమితి, ముందస్తు విత్‌డ్రా ఛార్జీలు, పన్ను ప్రభావం వంటి అంశాలను పరిశీలించి FDలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories