Fastag:గుడ్ న్యూస్... వీళ్లు అసలు ఫాస్టాగ్ కట్టాల్సిన అవసరమే లేదు..!
ఎవరికి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందో, ఏ రూల్స్ ఫాలో అవ్వకపోతే డబల్ టోల్ కట్టాలో తెలుసుకుందాం..
ఎవరికి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందో, ఏ రూల్స్ ఫాలో అవ్వకపోతే డబల్ టోల్ కట్టాలో తెలుసుకుందాం..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ ప్రకారం కొందరు ఇక నుంచి ఫాస్టాగ్ అసలు కట్టాల్సిన అవసరమే లేదు. మరికొందరు.. ఫాస్ట్ రూల్స్ తప్పితే డబల్ టోల్ కట్టాల్సి ఉంటుంది.మరి, ఎవరికి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందో, ఏ రూల్స్ ఫాలో అవ్వకపోతే డబల్ టోల్ కట్టాలో తెలుసుకుందాం..
మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) టోల్ వసూలు రూల్స్‌లో పెద్ద మార్పు చేసింది. ఇది ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఈ డేట్ నుంచి ముంబైలోని టోల్ ప్లాజాలన్నీ ఫాస్టాగ్ సిస్టమ్‌లో పనిచేస్తాయి.టోల్ ఛార్జీలు సరిగ్గా ఉండాలని, వెయిటింగ్ టైమ్ తగ్గించాలని, ట్రాఫిక్ తగ్గించాలని, జర్నీ చేసేవాళ్లకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ టోల్ కలెక్షన్‌కి పూర్తిగా మారడంతో, ఫాస్టాగ్ లేని వెహికల్స్ డబుల్ టోల్ కట్టాలి. ఎక్స్‌ట్రా ఛార్జ్‌ని క్యాష్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, యూపీఐ ద్వారా కట్టొచ్చు.
వెహికల్ నడిపేవాళ్లు అందరూ ఫాస్టాగ్‌కి మారాలని, పెద్ద లైన్లు, మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ తీసేసి, టోల్ కట్టే ప్రాసెస్ ఈజీ చెయ్యాలని ఈ రూల్ పెట్టారు. కొన్ని వెహికల్స్‌కి ఈ రూల్ నుంచి మినహాయింపు ఉంది. స్కూల్ బస్సులు, లైట్ మోటార్ వెహికల్స్, స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులకు ముంబైలోకి వచ్చే ఐదు మెయిన్ ఎంట్రీ పాయింట్స్‌లో ఫాస్టాగ్ అవసరం లేదు. వారు అసలు ఫాస్టాగ్ కట్టాల్సిన అసవరమే లేదు.
ములుండ్ వెస్ట్, ములుండ్ ఈస్ట్, ఐరోలి, దహిసర్, వాషి ప్రాంతాల్లోని టోల్ ప్లాజాలు ఇందులో ఉన్నాయి. ఈ మినహాయింపులు ఉన్నా, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే, పాత ముంబై-పుణే హైవే, ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలో ఫాస్టాగ్ సిస్టమ్ కచ్చితంగా అమలు చేస్తారు.
బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఫాస్టాగ్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెడితే, రీఛార్జ్ చేసిన వెంటనే స్టేటస్ మారకపోవచ్చు. అప్పుడు టోల్ అమౌంట్ ఫాస్టాగ్‌లోంచి కట్ కాకపోవచ్చు. దీనివల్ల డబుల్ ఛార్జ్ చేస్తారు. ఇది జరగకుండా ఉండాలంటే, ఫాస్టాగ్‌ని ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. టోల్ దగ్గరకు వచ్చినప్పుడు రీఛార్జ్ చేస్తామంటే కుదరదు. వీలైనంత వరకు మీ ప్రయాణం మొదలయ్యే ముందే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.