Business Ideas: మహిళలు ఇంటివద్ద నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం, నెలకు రూ. 1 లక్ష ఆదాయం

First Published Feb 7, 2023, 2:34 PM IST

ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఎన్నో అవకాశాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. తద్వారా మీరు ఇంటి వద్ద ఉండే చక్కటి  ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. అలాంటి వ్యాపార అవకాశాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బిజినెస్ ద్వారా చక్కటి అవకాశాలను కల్పిస్తున్న ఓ యాప్ గురించి తెలుసుకుందాం. తద్వారా మీరు స్మార్ట్ ఫోన్ ద్వారానే ఇంటి వద్ద ఉండి చక్కటి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
 

మీషో యాప్ (Meesho App) గురించి మీరందరూ వినే ఉంటారు ఈ యాప్ ద్వారా లక్షలాదిమంది తమ కస్టమర్లకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా చీరలు ఆర్టిఫిషియల్ జువెలరీ సహా అనేక ఉత్పత్తులను మీరు ఈ మీషో యాప్ (Meesho App) ద్వారా విక్రయించే అవకాశం ఉంటుంది ఈ యాప్ ద్వారా  లక్షలాదిమంది  మహిళలు ఇప్పటికే వ్యాపారం చేస్తున్నారు.  ఈ యాప్ ద్వారా మీరు నమోదు చేసుకొని, మీరు విక్రయించే ఉత్పత్తిని ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు ఆసక్తి ఉన్నటువంటి  కస్టమర్లు  మిమ్మల్ని సంప్రదించి ఉత్పత్తిని డెలివరీ పొందే అవకాశం ఉంటుంది
 

మీషో యాప్ (Meesho App) ద్వారా ఎక్కువగా చీరలు ఫ్యాన్సీ డ్రెస్సులు డిజైనర్ వేర్ పట్టు చీరలు పిల్లల దుస్తులు అలాగే ఆర్టిఫిషియల్ జువెలరీ ఎక్కువగా విక్రయిస్తున్నారు మీరు కూడా ఈ యాప్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే ముందుగా మీ షో యాప్ (Meesho App) ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ (Meesho App)లోకి వెళ్లిన వెంటనే మీరు విక్రేతగా పేరు నమోదు చేసుకోవచ్చు అలాగే మీరు విక్రయించదల్చే  వస్తువులను కూడా ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు తద్వారా మీకు మీషో యాప్ (Meesho App) నుంచి ఒక ఐడి విడుదల అవుతుంది ఆ ఐడి ద్వారా కస్టమర్లు మిమ్మల్ని సంప్రదిస్తారు వస్తువులు నాణ్యత ప్రమాణాలను మీరు ఆ పోస్ట్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది అప్పుడే కస్టమర్లు మీ వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు
 

 ఇక చెల్లింపుల విషయానికొస్తే చెల్లింపులు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే సాగుతాయి కావున మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో ఎటువంటి మోసానికి తావులేదు అయితే రాజీ పడకూడదు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయకూడదు నాణ్యమైన వస్తువులను సరఫరా చేస్తే మీకు కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో లభించే అవకాశం ఉంటుంది తద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం దక్కుతుంది
 

హోల్సేల్ మార్కెట్ ద్వారా మీరు వస్తువులను కొనుగోలు చేసి రిటైల్ ధరలకు యాప్ ద్వారా విక్రయించే అవకాశం లభిస్తుంది కావున ధర నిర్ణయించే సమయంలో మార్కెట్ ధర కన్నా కూడా మీరు కాస్త తక్కువకే విక్రయించడం ద్వారా చక్కటి లాభం పొందే అవకాశం ఉంటుంది అలాగే కస్టమర్లు కూడా మళ్లీ మళ్లీ మీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం మీకు లభిస్తుంది. దీనికి సంబంధించి అనుభవజ్ఞులైనటువంటి  బయ్యర్ల సలహా సూచనలను యూట్యూబ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. 

click me!