ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైళ్ల గురించి మాట్లాడితే సీట్లు కింద, మధ్య, పైన ప్రకారం విభజించి ఉంటాయి. కింద సీటును లోవర్ బెర్త్ అని, మధ్య సీటును మిడిల్ బెర్త్ అని పైన సీటును అప్పర్ బెర్త్ అంటారు. దీని కోసం LB, MB, UB కోడ్‌లు ఉపయోగిస్తారు. అంతే కాకుండా సైడ్ లోయర్, సైడ్ అప్పర్ సీట్లు కూడా ఇలాంటి రైళ్లలో చూడవచ్చు, దీని కోసం SL అండ్ SU కోడ్‌లు ఉపయోగిస్తారు.