Loan Apps: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులా.? భయపడకండి.. ఈ ఒక్క పని చేస్తే చాలు

Published : Mar 08, 2026, 05:24 PM IST

Loan Apps: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు ప్రస్తుతం పెరిగిపోతున్నాయి. రికవరీ ఏజెంట్లు అసభ్యకరంగా ప్రవర్తించడం, కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి ఫోన్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతుంటే ఎలా స్పందించాలో న్యాయ నిపుణులు కీలక సూచనలు ఇస్తున్నారు. 

PREV
15
అవసరానికి అప్పు.. అదే పెద్ద ముప్పు..

ప్రస్తుత కాలంలో అవసరానికి ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, లోన్ తీసుకున్న తర్వాత రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక చాలా మంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అసభ్యకరమైన ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, ఫేక్ లీగల్ నోటీసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ సమస్యలపై న్యాయ నిపుణులు పలు కీలక సూచనలు చేశారు.

25
వేధింపులు మొదలైతే ఏం చేయాలి?

రికవరీ ఏజెంట్లు మీ కాంటాక్ట్ లిస్ట్‌ను యాక్సెస్ చేసి, మీ స్నేహితులకు లేదా బంధువులకు ఫోన్ చేసి మీ పరువు తీస్తామని బెదిరిస్తుంటారు. ఇలాంటి సమయంలో భయపడి వారు అడిగినంత డబ్బు కట్టడం పరిష్కారం కాదు. మొదటగా మీ వాట్సాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయండి. లోన్ యాప్ ఏజెంట్లు ప్రధానంగా వాట్సాప్ ద్వారానే అసభ్యకరమైన ఫోటోలు లేదా మెసేజ్‌లు పంపుతుంటారు. డీయాక్టివేట్ చేయడం వల్ల వారికి ఆ అవకాశం ఉండదు.

35
మొబైల్ నంబర్ మార్చడం

వేధింపులు మరీ ఎక్కువగా ఉంటే, కొంతకాలం పాటు ఆ మొబైల్ నంబర్‌ను పక్కన పెట్టి కొత్త నంబర్‌ను వాడటం ఉత్తమం. అలాగే దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లేదా సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయండి. ఏజెంట్లు మిమ్మల్ని ఎలా వేధిస్తున్నారో, వారు పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్స్ లేదా కాల్ రికార్డింగ్స్ ఆధారంగా కంప్లైంట్ ఇవ్వండి.

45
లీగల్ నోటీసులు నిజమేనా.?

చాలా సందర్భాల్లో లోన్ యాప్ ఏజెంట్లు పంపే లీగల్ నోటీసులు నకిలీవి అయి ఉంటాయి. కేవలం మిమ్మల్ని భయపెట్టి డబ్బు వసూలు చేయడమే వారి ప్రధాన ఉద్దేశ్యం. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఏ బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ కూడా వినియోగదారుడి పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు.

55
ఆత్మహత్య పరిష్కారం కాదు..

లోన్ యాప్ వేధింపుల కారణంగా ఎవరూ ఆత్మహత్య లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని, ఇది కేవలం ఒక తాత్కాలిక సమస్య మాత్రమేనని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ధైర్యంగా పోలీసులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories