EPFO: ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ప్రతీ నెల జమ అయ్యే మొత్తాన్ని ఉద్యోగులు పదవి విరమణ తర్వాత లేదా ముందుగానే తీసుకునే తీసుకోవచ్చు. ఇందుకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇకపై యూపీఐ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం రానుంది.
పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట కలిగించే మార్పునకు ఈపీఎఫ్‌వో సిద్ధమవుతోంది. ఇకపై పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే రోజులు రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మొబైల్‌లో చేసే సాధారణ చెల్లింపుల్లానే పీఎఫ్ నిధులు కూడా త్వరగా అందే అవకాశం రాబోతోంది.
25
UPI ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ఎప్పటి నుంచి?
తాజా సమాచారం ప్రకారం ఈపీఎఫ్‌వో వచ్చే 2 నుంచి 3 నెలల్లో యూపీఐ ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విధానం కోసం NPCI సహకారంతో సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో ఈ సేవ BHIM యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది.
35
BHIM యాప్ ద్వారా ఎలా డబ్బు వస్తుంది?
BHIM యాప్‌లో పీఎఫ్ విత్‌డ్రా రిక్వెస్ట్ పెట్టగానే బ్యాక్ ఎండ్‌లో వెంటనే తనిఖీ జరుగుతుంది. అనారోగ్యం, పిల్లల చదువు, పెళ్లి వంటి అనుమతించిన అవసరాల కోసం దరఖాస్తు చేస్తే సిస్టమ్ వేగంగా వెరిఫికేషన్ పూర్తి చేస్తుంది. ఆపై SBI ద్వారా డబ్బు నేరుగా యూపీఐతో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇలా చేస్తే రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం రూ. 5 లక్షల లోపు ఆన్‌లైన్ అడ్వాన్స్ క్లెయిమ్‌కే కనీసం 3 పని దినాలు పడుతోంది. పెద్ద మొత్తం అయితే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటోంది. యూపీఐ విధానం అమల్లోకి వస్తే క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతుంది. దీంతో అత్యవసర అవసరాల్లో డబ్బు వెంటనే అందుతుంది. ఇది పీఎఫ్ సభ్యులకు పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.
55
UPI విత్‌డ్రా లిమిట్ ఎంత ఉండొచ్చు?
ఈ సదుపాయం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు మొదట్లో కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయించిన యూపీఐ ట్రాన్సాక్షన్ నిబంధనల ప్రకారమే పీఎఫ్ విత్‌డ్రా కూడా జరుగుతుంది. ప్రారంభ దశలో మొత్తం పీఎఫ్ అమౌంట్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఈ సేవ BHIM యాప్‌కే పరిమితం కానుంది. భవిష్యత్తులో వ్యవస్థ సాఫీగా పనిచేస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్ వంటి యాప్‌లకూ విస్తరించే అవకాశం ఉంది.