EPFO: ఉద్యోగం మారితే పీఎఫ్ డ‌బ్బు కొత్త ఖాతాల్లోకి ఎన్ని రోజుల్లో ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది.?

Published : Apr 10, 2026, 01:55 PM IST

EPFO: ఉద్యోగులు ప్రతి నెల జీతంలో నుంచి కట్ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ (PF) భవిష్యత్తుకు భద్రతగా ఉంటుంది. అయితే చాలామంది ఉద్యోగం మార్చిన తర్వాత పాత కంపెనీలో ఉన్న PF డబ్బు కొత్త ఖాతాలోకి బ‌దిలీ కావ‌డానికి ఎన్ని రోజులు ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌కు ఎంత సమయం?

EPFO నిబంధనల ప్రకారం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి PF డబ్బు ట్రాన్స్‌ఫర్ కావడానికి సాధారణంగా 7 నుంచి 20 రోజులు పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా KYC వివరాలు పూర్తి లేకపోవడం, ఎంప్లాయ‌ర్‌ ఆమోదం ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల 20 రోజులకు పైగా కూడా ప‌ట్టే అవకాశం ఉంటుంది.

25
PF డబ్బు ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

PF ట్రాన్స్‌ఫర్ పూర్తిగా UAN (Universal Account Number) ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని దశలు ఉంటాయి. ఉద్యోగి తన UAN ఖాతా ద్వారా PF ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పంపాలి. తర్వాత పాత కంపెనీ లేదా కొత్త కంపెనీ యజమాని (Employer) దాన్ని అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత EPFO అధికారులు ఆ వివరాలను వెరిఫై చేస్తారు. అన్ని వివరాలు సరైనవని నిర్ధారణ అయిన తర్వాత PF డబ్బు కొత్త ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. 

35
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు

కొన్ని కారణాల వల్ల PF డబ్బు ట్రాన్స్‌ఫర్ ఆలస్యం కావచ్చు. KYC వివరాలు పూర్తిగా అప్డేట్ కాకపోవడం, కొత్త కంపెనీ నుంచి అప్రూవల్ ఆలస్యం కావడం, ఆధార్, PAN లేదా ఇతర వివరాల్లో పేరు లేదా డేటా సరిపోకపోవడం, EPFO వెరిఫికేషన్ ప్రక్రియలో ఆలస్యం కావ‌డం వంటి సమస్యలు ఉంటే PF ట్రాన్స్‌ఫర్ సాధారణ సమయం కంటే ఎక్కువ పడుతుంది.

45
PF డబ్బు త్వరగా ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఏమి చేయాలి?

PF ట్రాన్స్‌ఫర్ త్వరగా జరగాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా సరిచూసుకోవాలి. UAN ఖాతాలో KYC పూర్తిగా అప్డేట్ అయి ఉండాలి. ఆధార్, PAN, బ్యాంక్ వివరాలు సరైనవిగా ఉండాలి. కొత్త కంపెనీ HR విభాగం నుంచి త్వరగా అప్రూవల్ రావాలి. UAN ఖాతాలో వ్యక్తిగత వివరాలు సరిపోవాలి. ఈ అంశాలు సరిగా ఉంటే ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది.

55
అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఎంత త్వరగా డబ్బు వస్తుంది?

మీ UAN ఖాతాలో KYC పూర్తిగా పూర్తి అయి ఉంటే, అలాగే ఉద్యోగదాత కూడా వెంటనే అప్రూవ్ చేస్తే PF ట్రాన్స్‌ఫర్ చాలా త్వరగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో PF డబ్బు 5 నుంచి 7 రోజుల్లోనే కొత్త ఖాతాలోకి చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగం మారిన వెంటనే UAN ఖాతాలో మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories