Unclaimed Assets: ఇంత‌కీ రూ. 2.2 ల‌క్ష‌ల కోట్లు ఎవ‌రివి.? మీ డబ్బులు ఏమైనా ఉన్నాయో చూసుకోండి

Published : Apr 10, 2026, 07:13 AM IST

Unclaimed Assets: భవిష్యత్తు కోసం బ్యాంకులు, షేర్ మార్కెట్, ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ ఆశ్చర్యకరంగా కోట్లాది రూపాయలు ప్రస్తుతం ఎలాంటి క్లెయిమ్ చేయ‌కుండా ఉన్నాయి. అంటే ఆ డబ్బుకు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు.

PREV
15
అన్ క్లెయిమ్డ్ ఆస్తులు అంటే ఏంటి.?

అన్ క్లెయిమ్డ్ ఆస్తులు అంటే యజమాని ఉన్నా కూడా వాటిని ఎవ్వరూ క్లెయిమ్ చేయకపోవడం. కొంతమంది పెట్టుబడులు పెట్టిన తరువాత వాటి గురించి మరిచిపోతారు. మరికొందరు మరణించిన తరువాత వారి కుటుంబ సభ్యులకు ఆ పెట్టుబడుల గురించి సమాచారం ఉండదు. దీంతో ఆ డబ్బు బ్యాంకులు లేదా సంబంధిత సంస్థల వద్దే అలాగే మిగిలిపోతుంది. కాలక్రమంలో అది “Unclaimed Assets”గా నమోదు అవుతుంది.

25
లిస్టెడ్ కంపెనీల్లోనే రూ.89 వేల కోట్లకు పైగా

ఒక ఫైనాన్స్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం డిసెంబర్ 2025 నాటికి భారతదేశంలోని 1671 లిస్టెడ్ కంపెనీల షేర్లలో దాదాపు రూ.89,004 కోట్లు అన్ క్లెయిమ్డ్ అసెస్స‌ట్‌గా ఉన్నాయి. ఈ షేర్లు చాలాసార్లు పెట్టుబడిదారులు కొనుగోలు చేసిన తరువాత ఖాతాలు యాక్టివ్‌గా ఉంచకపోవడం, కుటుంబ సభ్యులకు వివరాలు తెలియకపోవడం, డిమాట్ ఖాతాలు మూసివేయడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ కాకుండా ఉంటాయి.

35
బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఈపీఎఫ్‌లో ఎంత డబ్బు ఉంది?

అన్ క్లెయిమ్డ్ డబ్బు ఒక్క చోట మాత్రమే కాదు. పలు రంగాల్లో విస్తరించి ఉంది. బ్యాంక్ డిపాజిట్ల రూపంలో దాదాపు రూ.97,545 కోట్లు ఉంది. ఈ డబ్బు రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే DEA ఫండ్లోకి వెళుతుంది. దీనిపై సుమారు 3% సాధారణ వడ్డీ మాత్రమే ఉంటుంది. షేర్ మార్కెట్‌లో రూ.89,004 కోట్లు లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఉన్నాయి. ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో దాదాపు రూ.20,062 కోట్ల మేచ్యూరిటీ క్లెయిమ్, డెత్ క్లెయిమ్ లేదా సరెండర్ విలువగా ఉన్నాయి. ఇక ఈపీఎఫ్ ఖాతాల విష‌యానికొస్తే దాదాపు రూ.10,915 కోట్లు క్లెయిమ్ కాకుండా ఉన్నాయి. ఇందులో 38% ఖాతాలు సంవత్సరాలుగా ఇనాక్టివ్‌గా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లలో దాదాపు రూ.3,452 కోట్లు క్లెయిమ్ చేయని పెట్టుబడులుగా ఉన్నాయి.

45
ఈ డబ్బు ఎందుకు క్లెయిమ్ కావడం లేదు?

అన్ క్లెయిమ్డ్ ఆస్తులు పెరగడానికి కొన్ని ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయి. అవేంటంటే..

* పెట్టుబడి సమయంలో నామినీ వివరాలు నమోదు చేయకపోవడం.

* తర్వాత నామినీ వివరాలు అప్‌డేట్ చేయకపోవడం.

* కుటుంబ సభ్యులకు పెట్టుబడుల గురించి తెలియకపోవడం.

* పెట్టుబడిదారుడు మరణించిన తరువాత క్లెయిమ్ ప్రక్రియ తెలియకపోవడం.

* పాత ఖాతాలు, డాక్యుమెంట్లు మరచిపోవడం. ఈ కారణాల వల్ల చాలా డబ్బు అలాగే మిగిలిపోతుంది.

55
పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

భవిష్యత్తులో ఇలా అన్ క్లెయిమ్డ్ కాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రతి పెట్టుబడికి నామినీ నమోదు చేయాలి, నామినీ వివరాలు అవసరమైతే సమయానికి అప్‌డేట్ చేయాలి, పెట్టుబడుల వివరాలు కుటుంబ సభ్యులతో పంచుకోవాలి, బ్యాంక్, డిమాట్, ఇన్సూరెన్స్ ఖాతాలను సక్రమంగా యాక్టివ్‌గా ఉంచాలి. పెట్టుబడుల జాబితాను ఒక చోట నమోదు చేసి భద్రపరచాలి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కోట్ల రూపాయల పెట్టుబడులు భవిష్యత్తులో అన్ క్లెయిమ్డ్ కాకుండా ఉంటాయి..ప్ర‌స్తుతం ఉన్న రూ. 2.2 ల‌క్ష‌ల కోట్ల అన్ క్లెయిమ్డ్ మొత్తంలో మీ డ‌బ్బు కూడా ఉండి ఉండొచ్చు. ఒక‌సారి మీ పెద్ద‌ల‌ను అడిగి తెలుసుకోండి. లేదంటే ఇంట్లో బీరువాల్లో ఉన్న పాత ఫైల్స్‌ను తిరిగేయండి.

Read more Photos on
click me!

Recommended Stories