ఉద్యోగం మారుతున్నారా.. ఈ‌పి‌ఎఫ్‌ఓలో పెద్ద మార్పు.. అదేంటో తెలుసుకోండి..

First Published Nov 23, 2021, 9:13 PM IST

 పనిచేసే ఉద్యోగులకు ఓ శుభవార్త. ఈ‌పి‌ఎఫ్‌ఓ (epfo)ఫండ్ ట్రాన్స్ఫర్ కి సంబంధించి పెద్ద మార్పు చేసింది. ఈ మార్పు తర్వాత మీరు ఉద్యోగాలు మారినప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్(fund transfer) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగం మారిన తర్వాత, మీ పి‌ఎఫ్ ఖాతా(pf account) ఆటోమేటిక్‌గా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. 

ఈ విషయంలో     ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​ఇప్పుడు సెంట్రలైజేడ్  ఐ‌టి- ఎనేబుల్డ్ సిస్టంను ఆమోదించింది. ఈ మార్పు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంతకుముందు ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడు వారి పిఎఫ్ నిధులను స్వంతంగా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉండేది. ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​చేసిన ఈ మార్పు తర్వాత మీరు ఉద్యోగాలు మారినట్లయితే మీరు ఇక అలా చేయాల్సిన అవసరం లేదు. 

 మీ పి‌ఎఫ్ నిధులు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. పి‌ఎఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ కి సంబంధించి చేసిన ఈ మార్పు తర్వాత దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త  మార్పు గురించి వివరంగా తెలుసుకోండి...

ఈ కొత్త సిస్టంను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసింది. ఈ సిస్టం దశలవారీగా పనిచేస్తుంది. ఇందులో వారి పీఎఫ్ ఖాతాలను డీ-డూప్లికేషన్, విలీనం చేసే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మీరు మీ పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి వెళితే మీ పి‌ఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా  ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇందుకు మీరు  మాన్యువల్గ  చేయాల్సిన అవసరం లేదు. 

ఈ సెంట్రలైజేడ్ సిస్టం రాకతో ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది. ఈ మార్పు తర్వాత ఉద్యోగుల పి‌ఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ద్వారా ఒక అక్కౌంట్ క్రియేట్ అవుతుంది. దీని వల్ల పీఎఫ్ ట్రాన్స్ఫర్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

click me!