7th పే కమిషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు, పెన్షన్‌ పెంపు..?

Ashok Kumar   | Asianet News
Published : Nov 23, 2021, 06:38 PM IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ(narendra modi) ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును, వారికి వచ్చే పెన్షన్ (pension)మొత్తాన్ని పెంచనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ (UPS) ఆర్థిక సలహా కమిటీ ప్రధానికి ప్రతిపాదన కూడా పంపింది.

PREV
14
7th పే  కమిషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు, పెన్షన్‌ పెంపు..?

ప్రతిపాదన ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని సిఫార్సు చేసింది. దీనితో పాటు సార్వత్రిక పెన్షన్ విధానాన్ని కూడా ప్రారంభించాలని కమిటీ కోరింది.  
 

24

ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చ
సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోతైన సమాలోచనలో ఉంది. ఈ ప్రతిపాదనలో దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రతకు మెరుగైన ఏర్పాట్లను ఆర్థిక సలహా కమిటీ సిఫార్సు చేసింది. అలాగే సీనియర్ సిటిజన్లకు కనీసం నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వాలని సూచించారు. పని చేసే వారి జనాభా పెరగాలంటే అందుకు పదవీ విరమణ వయస్సును తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఇలా చేయవచ్చు. 

34

స్కిల్ డెవలప్‌మెంట్‌పై కమిటీ సూచనలు 
కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో.. స్కిల్ డెవలప్‌మెంట్ జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విధానాలను రూపొందించాలని పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల నైపుణ్యాభివృద్ధిని నివేదిక సూచిస్తుంది. ఈ ప్రయత్నంలో అసంఘటిత రంగంలో నివసిస్తున్న వారు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, శరణార్థులు, వలసలు, శిక్షణ పొందే స్తోమత లేని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

44

దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య 
ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2050 నాటికి దేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. అలాగే  2019 సంవత్సరంలో భారతదేశ జనాభాలో కేవలం 10 శాతం లేదా 140 మిలియన్ల మంది మాత్రమే సీనియర్ సిటిజన్ల వర్గంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 

click me!

Recommended Stories