సామాన్యుడి పై వంటింటి భారం.. ఆకాశాన్నంటుతున్న టమాటో ధరలు..

First Published Nov 23, 2021, 5:31 PM IST

 ద్రవ్యోల్బణంతో ప్రతి రంగం దెబ్బతింటోంది, ఇందులో ఆహార పదార్థాల ధరలు పెరగడం సామాన్యులను అతలాకుతలం చేస్తుంది. ఇప్పుడు ప్రజల కష్టాల్లో టమాటా ధరలు(tomato prices) ముందు వరుసలో కనిపిస్తోంది. నిజానికి ఈ మధ్య కాలంలో కూరగాయల ధరలు ముఖ్యంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. చలికాలం(winter)లో కిలో రూ.20కి లభించే టమాటా ధర పలు నగరాల్లో రూ.150 దాటింది.

చెన్నైలో టొమాటో ధర
చెన్నైలో టొమాటో కిలో ధర రూ.160కి విక్రయిస్తున్నారు. వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పంటలు నష్టపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. బెంగళూరులో టమాటా ధర కిలోకి రూ.110, ముంబైలో టమాటా కిలోకి రూ.80 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ టమాటా ధర కిలోకి రూ.60 నుంచి 90కి చేరింది. టమాటాతో పాటు ఉల్లి ధరలు కూడా భారీగా పెరగడంతో ఢిల్లీ-ముంబైలలో కిలో ఉల్లిని రూ.60కి విక్రయిస్తున్నారు. 

 ఒక నివేదిక ప్రకారం, తక్కువ దిగుబడి అధిక డిమాండ్ ఇంకా రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా టమాటో ధరలు నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయని కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. యాప్ ఆధారిత గ్రోసరీ స్టార్టప్‌లు కూడా టొమాటోలను కిలోకి రూ.120 చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
 

 ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక ప్రాంతాలలో వర్షాల కారణంగా టమోటాల ధరలు ప్రభావితమయ్యాయి. పంటలు దెబ్బతినడంతో గతంలో 27 కిలోల టమాటను పొలం నుంచి రూ.500కు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.3వేలకు చేరుకుంది. టమాటా ధరలు గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయికి పెరగలేదు.

కస్టమర్లు ఏం చెప్తున్నారంటే
ఒక వినియోగదారుడు మాట్లాడుతూ టమాటా ధర గతంలో కిలో రూ.20-30 ఉండేదని, ఇప్పుడు రూ.100కి చేరుకుందని పెట్రోలు, డీజిల్ ధరలు పెంపుతో మిగతావి కూడా ఖరీదైనవిగా మారాయి అని  అన్నారు. పెరుగుతున్న కూరగాయల ధరలు వంటగది బడ్జెట్‌ను పెంచుతున్నాయని మరొక వినియోగదారు అన్నారు. ఈ ధరల మంటని నివారించేందుకు టమాటో వినియోగాన్ని తగ్గించుకున్నాం. తక్కువ ధర ఉన్న కూరగాయలు తింటున్నాం. బంగాళదుంపలు, క్యాబేజీ ఇతర తక్కువ ధర ఉన్న కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం అని ఇంకొకరు అన్నారు.

ఇక హైదరాబాద్ లో కిలో టొమాటో ధర రూ.60 నుండి రూ.80 మధ్య  ఉంది.

click me!