క్రెడిట్‌ కార్డు విషయంలో బ్యాంకులే మీకు రోజుకు 500 ఇస్తాయి. ఎందుకో తెలుసా

First Published | Aug 18, 2024, 12:58 PM IST

మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా.. కారణం ఏదైనా దాన్ని క్లోజ్‌ చేయాలనుకుంటున్నారా.. క్రెడిట్‌ కార్డు కాన్సల్‌ చేయమని మీ బ్యాంకును రిక్వెస్ట్‌ చేశాకా.. అటువైపు నుంచి రెస్పాన్స్‌ లేకపోతే మీరు రోజుకు రూ.500 పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..
 

క్రెడిట్‌ కార్డు.. ఇప్పుడు ప్రతి ఉద్యోగి జీవితంలో కంపల్సరీ వస్తువైంది. ఎందుకంటే జీతాలు సమయానికి పడవు. అయితే ఇంట్లో ఖర్చులు ఆగవు కదా.. కచ్చితంగా క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ముందు నిత్యావసరాలు తీర్చాలి మరి.. ఇది చాలా మందికి బర్డెన్‌గానే ఉంటుంది. కాని తప్పక వినియోగించాల్సిన పరిస్థితి.  అయితే RBI నిబంధనల ప్రకారం క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేయమని మీరు అభ్యర్థించిన ఏడు రోజుల్లోపు మీ క్రెడిట్ కార్డును బ్యాంకులు మూసివేయాలి. ఏ కారణంగానైనా లేట్‌ అయితే ఆ బ్యాంకే మీకు రోజుకు రూ. 500 ఇవ్వాల్సి వస్తుంది. 
 

క్రెడిట్ కార్డ్ క్లోజర్‌పై RBI నియమం ఇది..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) 2022లో ఈ కొత్త రూల్‌ తీసుకొచ్చింది. ఈ నియమం ప్రకారం క్రెడిట్‌ కార్డు రద్దు చేయమని మీరు అప్లై చేసిన ఏడు రోజుల్లోపు సదరు బ్యాంకులు మీ క్రెడిట్ కార్డును మూసివేయాలి. ఏ కారణంగానైనా బ్యాంకులు లేట్‌ చేస్తే కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాప్యానికి కారణం బ్యాంకులే అయితే వినియోగదారులకు రోజుకు రూ. 500 చెల్లించాలి.
 


బకాయిలు లేకుండా చూసుకోండి..

మీ క్రెడిట్ కార్డును మూసివేసే ముందు అన్ని బకాయిలు చెల్లించారో లేదో ముందుగానే నిర్ధారించుకోండి. పెండింగ్‌ బిల్స్‌ ఉంటే కార్డును బ్యాంకు మూసివేయదు. ఏవైనా పెండింగ్‌ బిల్స్‌ ఉంటే మీరు పరిహారం పొందడానికి అర్హులు కారు. 
 

రివార్డ్ పాయింట్‌లను వృథా చేసుకోవద్దు..

కార్డును మూసివేసే ముందు మీ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోండి. మీ ఖర్చు ద్వారా ఇవి ఖాతాలోకి వస్తాయి. కాబట్టి వాటిని వృధా చేసుకోకండి. క్లోజర్ ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత క్రెడిట్ కార్డు దుర్వినియోగం కాకుండా కత్తిరించడం, విరగొట్టడం, కాల్చివేయడం మంచిది.  
 

Latest Videos

click me!