ఈ రాఖీకి మీ సోదరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ కోసమే 5 స్మార్ట్ ఆప్షన్స్

మీ సోదరికి పర్ఫెక్ట్ రాఖీ గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? రక్షా బంధన్ 2024ను ప్రత్యేకంగా చేయడానికి రూ.2000లోపు టాప్ 5 గిఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

rakhi 2024

రాఖీ.. రక్షా బంధన్‌.. ఇలా పేరేదైనా, దేశమంతా జరుపుకొనే పండుగ ఇది. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారతీయ సంతతికి చెందిన ప్రజలు రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19న రక్షా బంధన్ జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం చివరి రోజున రక్షా బంధన్ వస్తుంది. ఈ రోజు సోదర సోదరీమణులు తమ బంధాన్ని, ఆప్యాయతను గౌరవించుకుంటారు.

Rakhi Gifts

రాఖీ పౌర్ణమి రోజున సోదరుడి చేతికి సోదరీమణులు రాఖీ కడతారు. ఒకరికొకరు రక్షగా నిలుస్తామని ప్రమాణం చేస్తారు. రాఖీకి కట్టిన సోదరికి బదులుగా అన్నదమ్ములు ఓ గిఫ్ట్‌ కూడా ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. ఇలా మీరు కూడా మీ సోదరికి పనికొచ్చే బహుమతులు ఇవ్వాలనుకుంటే.. మీకోసమే కొన్ని మంచి ఆప్షన్స్‌ ఉన్నాయి. అవి కూడా రూ.2 వేల కంటే తక్కువ ధరల్లో.. 


Hair Dryers

హెయిర్ డ్రైయర్స్

ఫిలిప్స్, సిస్కా, నోవా, ఇంకా మరెన్నో ఫేమస్‌ బ్రాండ్స్‌కి చెందిన అనేక రకాల హెయిర్ డ్రైయర్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటి ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి రూ.2 వేల మధ్య ఉంటుంది. మీ సోదరికి గిఫ్ట్‌ ఇవ్వడానికి ఇది మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

Hair Straightener

హెయిర్ స్ట్రెయిటనర్

సెలూన్‌కు వెళ్లకుండా ఇంట్లోనే హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు హెయిర్ స్ట్రెయిటెనర్లు చాలా ఉపయోగపడతాయి. జుట్టును పాలిష్ చేసి ఫ్రిజ్‌- ఫ్రీ, ఇంకా డిటాంగిల్డ్‌గా ఉంచుతాయి. హావెల్స్, ఫిలిప్స్, నోవా, మరెన్నో బ్రాండ్ల హెయిర్ స్ట్రెయిటర్లను మార్కెట్‌ అందుబాటులో ఉన్నాయి. అది కూడా రూ.600 నుంచి రూ.2,000 రేంజ్‌లో. ఇది మీ సోదరి కోసం అనువైన ఎంపిక కావచ్చు.
 

Smart Speakers

స్మార్ట్ స్పీకర్లు

స్మార్ట్ స్పీకర్లు అద్భుతమైన వాయిస్-యాక్టివేటెడ్ గాడ్జెట్లు. వీటిని సాధారణ స్పీకర్లకు అదనంగా వర్చువల్ అసిస్టెంట్లుగా ఉపయోగించవచ్చు. మీ సోదరి ఉద్యోగం చేసేవారైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌తో కూడిన స్మార్ట్‌ స్పీకర్లు.. వారి డౌట్స్‌ క్లారిఫై చేయడానికి, వినోదాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. అమెజాన్, షియోమీ, గూగుల్ లాంటి బ్రాండ్లు పెద్ద ఎత్తున స్మార్ట్ స్పీకర్లను అందిస్తున్నాయి. రూ.2,000తో షియోమీ స్మార్ట్ స్పీకర్ కొని ఈ రాఖీ పండగకి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
 

Ear Buds

వైర్‌లెస్ ఇయర్ బడ్స్

మీరు చదవడానికి, కాల్స్ తీసుకోవడానికి, సంగీతం వినడానికి ఇయర్‌ బడ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. రియల్ వైర్ లెస్ టెక్నాలజీ, నాయిస్ రిడక్షన్‌తో భారత మార్కెట్ అద్భుతమైన ప్రత్యామ్నాయాలను అందిస్తోంది. ఈ ఇయర్ ఫోన్స్ ధర రూ.1,000 నుంచి రూ.2,000 ఉంటుంది. అంతకంటే ఎక్కువ ధరల్లోనూ అందుబాటులో ఉన్నాయి. 

బ్లూటూత్ ట్రాకర్

బ్లూటూత్ ట్రాకర్ అనేది ఒక చిన్న గాడ్జెట్. ఈ ట్రాకర్లను ఉపయోగించి మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో త్వరగా కనిపిట్టేయొచ్చు. ఇది బ్లూటూత్ ద్వారా మొబైల్‌కి వైర్‌లెస్‌గా కనెక్ట్‌ చేసుకోవచ్చు. బ్లూటూత్‌ ట్రాకర్‌ని మీ సోదరికి గిఫ్ట్‌గా ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన వస్తువులను ట్రాకర్‌ సాయంతో గుర్తించవచ్చు. సుమారు రూ.1500 ధరల్లో ఇండియన్‌ మార్కెట్‌లో మంచి బ్లూటూత్‌ ట్రాకర్లు దొరుకుతాయి. 

Latest Videos

click me!