90 వేల Apple iPhone 18 వేలకే..

Published : Aug 18, 2024, 12:06 PM IST

శ్రావణ మాసం డిస్కౌంట్ ఆఫర్లు అంటే ఎక్కువ లేడీస్ కే అనుకుంటారు. జంట్స్ ను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా Apple కంపెనీ iPhone 15 Plus మోడల్ కు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సుమారు రూ.90 వేల విలువైన ఈ ఫోన్ అన్ని డిస్కౌంట్లు పోను కేవలం రూ.18 వేలకు లభిస్తుంది. ఆ వివరాలు తెలుసుకోండిలా..  

PREV
13
90 వేల Apple iPhone 18 వేలకే..

128 జీబీ స్టోరేజ్ తో ఉన్న iPhone 15 Plus నలుపు రంగు మోడల్ ను 2023లోనే మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ కు భారీ డిస్కౌంట్ ను  Apple కంపెనీ ప్రకటించింది. దీని అసలు ధర రూ.89,600 కాగా, 10 శాతం డిస్కౌంట్ తో 80,000లకు ఇస్తున్నారు. 

23

iPhone 15 Plus 6.7 అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంది. ప్రోమోషన్ టెక్నాలజీ ఉండటం వల్ల డిస్ల్పే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. టచ్ చాలా స్మూత్ గా ఉండటం వల్ల వీడియో గేమ్స్ ఆడేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. iPhone 15 Plus ఏ-16 బయోనిక్ చిప్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ కావడం విశేషం. ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే మెయిన్ కెమెరా 48 ఎంపీ కెపాసిటీ కలిగి ఉంది. అందువల్ల ఫొటోలు చాలా అద్భుతంగా వస్తాయి. ల్యాండ్ స్కేప్, జూమ్ షాట్లు ఇలా ప్రతి యాంగిల్ లో కెమెరా పనితీరు కట్టిపడేస్తుంది. బ్యాటరీ ఛార్జ్ కూడా చాలా ఎక్కువ సమయం వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకోవచ్చు.
 

33
ఆఫర్లు ఇలా..

మొబైల్ మార్కెట్ లో  iPhone 15 Plus(బ్లాక్) రూ.89,600 కాగా అమెజాన్ కంపెనీ 10 శాతం డిస్కౌంట్ తో 80,600లకు అందిస్తోంది. అయితే మీ పాత ఫోన్ ను ఎక్ఛేంజ్ చేస్తే సుమారు రూ.58,700 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ పనితీరు బాగుండాలి మరి.. ఈ ఆఫర్స్ కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించే కస్టమర్లకు అదనంగా రూ.4,030 తగ్గింపు లభిస్తుంది. ఇలాంటి మరికొన్ని తగ్గింపులను కలుపుకొంటే ఫైనల్ గా iPhone 15 Plus(బ్లాక్) కేవలం రూ.17,870 లకు అమెజాన్ సైట్ లో లభిస్తుంది. 

click me!